బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నై పర్యటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు, బీజేపీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమిత్ షాపై ఒక ఆందోళనకారుడు ప్లకార్డును విసిరేందుకు ప్రయత్నించాడు.

అయితే అవి అమిత్ షాకు తగలకుండా భద్రతా దళాలు అడ్డుకున్నాయి. వెంటనే అమిత్ షాను కాన్వాయ్‌లోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం హోంమంత్రిపై ప్లకార్డులు విసిరేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.