ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని షా పేర్కొన్నారు. బీజేపీ వరుసగా రెండుసార్లు ఎన్నికైంది. 30 ఏళ్ల తర్వాత ప్రజలు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాని మోదీనే .. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు చెబుతున్నాయనీ, ఈ విషయాన్ని సర్వేలే చెబుతున్నాయని అమిత్ షా అన్నారు. 

అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ప్రభుత్వం తరుఫున హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కూటమి 'భారత్' అవిశ్వాస తీర్మానంపై బుధవారం (ఆగస్టు 9) లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ప్రధానిపై, బీజేపీ ప్రభుత్వంపై విశ్వాసం లేదనే ప్రచారానికి కాంగ్రెస్ తెర తీస్తుందనీ, ఇది కేవలం భ్రమ కల్పించడమేనని అన్నారు. దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని నమ్ముతున్నారని అన్నారు.

స్వాతంత్ర్యం తరువాత.. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోడీనేననీ, ఆయన ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారని తెలిపారు. ప్రధాని మోడీ దేశ ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారనీ, ఆయన రోజుకు 17 గంటల పాటు నిరంతరం పని చేస్తాడనీ, ఒక్క సెలవు కూడా తీసుకోకుండా.. ప్రజలకు సేవ చేస్తున్నారని అమిత్ షా తెలిపారు. PM మోడీ ప్రభుత్వం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందనీ, UPA ప్రభుత్వం అధికారాన్ని కాపాడుకోవడం కోసం తపత్రాయ పడితే. NDA మాత్రం ప్రజల రక్షణ కోసం పోరాడుతుందని అన్నారాయన.

ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని షా పేర్కొన్నారు. బీజేపీ వరుసగా రెండుసార్లు ఎన్నికైంది. 30 ఏళ్ల తర్వాత ప్రజలు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాని మోదీనే .. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు చెబుతున్నాయనీ, ఈ విషయాన్ని సర్వేలే చెబుతున్నాయని అమిత్ షా అన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం 35 ఏళ్ల పాటు కొనసాగిందనీ, ఈ సమయంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని ఆరోపించారు. తమ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుందని అన్నారు. రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా అమిత్ షా మాట్లాడుతూ.. ఒక వ్యక్తి 13 సార్లు కెరీర్ ప్రారంభించి.. 13 సార్లు విఫలమయ్యారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. 

రాహుల్ గాంధీ ఏమన్నారు?

అంతకుముందు..అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత దేశ ఆత్మ (మణిపూర్‌)ను మోడీ సర్కార్ హత్య చేసిందని అన్నారు. ప్రధాని మోదీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదని ఆరోపించారు. బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందని అన్నారు. మణిపూర్ మహిళల బాధలు కేంద్రానికి అర్థం కావడం లేదని అన్నారు.

ప్రధాని మోదీని పరోక్షంగా రావణాసురుడితో పోల్చారు. రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడు చెప్పిన మాటలనే వినేవాడని, మోదీ కూడా ఇద్దరి మాటలనే వింటారని, వారిద్దరూ అమిత్ షా, అదానీ అని విమర్శించారు. బీజేపీ నేతలు దేశభక్తులు కాదని, దేశ ద్రోహులని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో అధికార బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈశాన్య రాష్ట్రాలను అవమానిస్తున్న రాహుల్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు.