Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పిచ్చి పట్టింది - ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాదవ్ ఘాటు వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి అమిత్ షా పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేతకు పిచ్చి పట్టిందని, అందుకే అలా మాట్లాడుతున్నారని అన్నారు. 

Union Home Minister Amit Shah has gone mad - RJD chief Lalu Prasad Yadav
Author
First Published Sep 24, 2022, 5:39 PM IST

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పిచ్చి పట్టిందని రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ‘మహాకూటమి జంగల్‌ రాజ్‌’ ను రాష్ట్రం కోరుకోవడం లేదని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు లాలూ కౌంట‌ర్ ఇచ్చారు. 

కంగనా రనౌత్ ఎన్నికల పోటీపై బీజేపీ ఎంపీ హేమా మాలినీ హాట్ కామెంట్.. ‘రాఖీ సావంత్ కూడా చేస్తుంది’

‘‘ అమిత్ షాకు పూర్తిగా పిచ్చి పట్టింది. బీహార్‌లో ఆయన ప్రభుత్వం తొలగించారు. 2024లో కూడా బీజేపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంటుంది. అందుకే అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లి జంగిల్‌ రాజ్‌ గురించి మాట్లాడుతున్నారు. ఆయన గుజరాత్ లో ఉన్న‌ప్పుడు ఏం చేశారు. జంగిల్ రాజ్ గుజరాత్‌లో ఉన్నప్పుడు అక్కడే ఉన్నాడు ’’ అని లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ శ‌నివారం మీడియాతో అన్నారు.

బీహార్ సీఎం నితీష్ కుమార్ యాద‌వ్, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ లు ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. ఈ స‌మావేశం నేప‌థ్యంలోనే లాలూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి జేడీ(యూ) తెగ‌దింపులు చేసుకున్న త‌రువాత నితీష్ కుమార్ ఆర్జేడీతో క‌లిపి బీహార్ లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ఏడాదిన్న‌ర‌గా మృత‌దేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్న కుటుంబ స‌భ్యులు.. ఖంగుతిన్న అధికారులు

‘‘నితీష్ కుమార్, నేను సోనియాగాంధీని కలుస్తాము. మేము ప్రతిపక్షాలను ఏకం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ’’ అని లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. అయితే 024లో ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి దింపేందుకు ప్రతిపక్షాలు భావిస్తున్నాయని, కానీ వాటి మధ్య ఉన్న అస‌మాత‌ల‌ను మీడియా ప్ర‌శ్నించ‌గా.. వాటిని తాము తొల‌గిస్తామ‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని తాను ఎన్నోసార్లు చెప్పాన‌ని అన్నారు. 

ఇదిలా ఉండ‌గా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్ర‌వారం బీహార్ లోని పూర్ణియాలో ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బీహార్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ల జోడీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఏడాది త‌రువాత వ‌చ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.  ప్రధాని కావాలనే నితీష్ కుమార్ బీజేపీకి నమ్మకద్రోహం చేశారని అమిత్ షా ఆరోపించారు.

ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం.. రోజు సాయంత్రం టీవీలు, ఫోన్‌లు ఆఫ్.. మెరుగవుతున్న పిల్లల చదువులు, పెద్దల బంధాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంటే తక్కువ స్థానాలే జేడీయూకి లభించినప్పటికీ నితీశ్ కుమార్‌కి సీఎంగా అవకాశం కల్పించామని అమిత్ షా గుర్తుచేశారు. అయినప్పటికీ నితీశ్ నమ్మకద్రోహం చేశారని, ప్రధాని కావాలనే ఆకాంక్షతో కాంగ్రెస్, లాలూ ప్రసాద్ యాదవ్‌లో చేతులు కలిపారని అమిత్ షా ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios