Asianet News TeluguAsianet News Telugu

కంగనా రనౌత్ ఎన్నికల పోటీపై బీజేపీ ఎంపీ హేమా మాలినీ హాట్ కామెంట్.. ‘రాఖీ సావంత్ కూడా చేస్తుంది’

బీజేపీ ఎంపీ హేమా మాలినీ.. కంగనా రనౌత్ పై హాట్ కామెంట్ చేశారు. ఫిల్మ్ స్టార్స్ మాత్రమే ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటే.. రాఖీ సావంత్ కూడా బరిలోకి దిగుతుంది అంటూ కామెంట్ చేశారు.
 

bjp mp hema malini hot comments on kangana ranauth possible   election contest from her constituency
Author
First Published Sep 24, 2022, 4:47 PM IST

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ హేమా మాలినీ శనివారం హాట్ కామెంట్ చేశారు. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మాథుర పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, అదే సీటు నుంచి కంగనా రనౌత్ పోటీ చేసే గుసగుసలు వినిపిస్తున్నాయని ఓ విలేకరు ఆమె ముందు ప్రస్తావించారు. మంచిదే.. మంచిదే.. పోటీ చేయనివ్వండి అంటూ ఆమె అన్నారు. ‘ఇదంతా భగవంతుడికే వదిలిపెడుతున్నా.. కృష్ణుడు ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు’ అని దాట వేసే ప్రయత్నం చేశారు. మరోసారి కంగనా రనౌత్ ప్రస్తావన తేగానే.. ఆమె అందరినీ షాక్‌కు గురి చేసే కామెంట్ చేశారు.

కంగనా రనౌత్ ఈ సీటు నుంచి పోటీ చేయవచ్చని అనుకుంటున్నారని, దీనిపై అభిప్రాయం ఏమిటని బీజేపీ ఎంపీ హేమా మాలినీని విలేకరులు అడిగారు. ఈ ప్రశ్న అడగ్గానే ఆమె వెనకే ఉన్న కొందరు నవ్వుతూ పక్కకు జరిగారు. ఆమె కూడా నవ్వుతూ అదంతా దేవుడు చూసుకుంటాడు అని దాటవేసే ప్రయత్నం చేసింది. అయితే.. మీ అభిప్రాయం చెప్పండి అంటూ విలేకరులు స్పష్టంగా అడిగారు.

‘మాథుర నుంచి ఎన్నికైన రాజకీయ నేతలు మీకు వద్దు.. కానీ, మాథుర సీటు నుంచి కేవలం ఫిల్మ్ స్టార్‌లు మాత్రమే పోటీ చేయాలని మీరు అందరి తలలోకి ఎక్కిస్తారు’ అని అన్నారు. అలాగైతే.. ‘రేపు రాఖి సావంత్ కూడా ఎన్నికలో పోటీ చేస్తుంది’ అంటూ కామెంట్ చేస్తూ ఆమె కారు ఎక్కేశారు. 

ఈ వీడియోను న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోపై విచిత్ర కామెంట్లు వస్తున్నాయి. ఓ ట్విట్టర్ యూజర్.. ఈమె స్వయంగా ఒక ఫిల్మ్ స్టార్..ఆమె భర్త, కొడుకు కూడా రాజకీయాల్లో చేరారు. కానీ, ఫిల్మ్ స్టార్స్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ కావడం ఈమెకు ఇబ్బందిగా ఉన్నది.. అంటూ కామెంట్ చేశాడు. పదేళ్లుగా ఆమె ప్రజల కోసం ఏమి చేశారో చెప్పాలని ఒకరు ప్రశ్నించారు.

కంగనా రనౌత్ ఎన్నికల్లోకి వస్తారనే సంకేతాలు ఇప్పటికైతే లేవు. కానీ, గతేడాది డిసెంబర్‌లో ఆమె మాథురలో ఓ కామెంట్ చేశారు. తాను ఏ పార్టీలో లేను కాబట్టి.. జాతీయవాదుల తరఫున క్యాంపెయిన్ చేస్తానని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios