12 రాష్ట్రాల్లో లక్ష కేసులు... బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్‌లలో దారుణ పరిస్థితులు: లవ్ అగర్వాల్
దేశంలో కరోనా పాజిటివిటీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్. బుధవారం దేశంలో కోవిడ్ పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 12 రాష్ట్రాల్లో లక్ష కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు వున్నాయన్నారు.
దేశంలో కరోనా పాజిటివిటీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్. బుధవారం దేశంలో కోవిడ్ పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 12 రాష్ట్రాల్లో లక్ష కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు వున్నాయన్నారు.
బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్‌లలో పరిస్ధితి దారుణంగా వుందని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. 13 రాష్ట్రాల్లో రోజుకు వంద మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయని... నిన్నటితో పోలిస్తే ఇవాళ ఎక్కువ కేసులు నమోదయ్యాయని లవ్ అగర్వాల్ తెలిపారు. బెంగళూరులో పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువ వుందన్నారు. ఒక్క బెంగళూరులోనే వారంలో లక్షన్నర కేసులు నమోదయ్యాయని లవ్ అగర్వాల్ చెప్పారు.
మరోవైపు ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనాతో ఒకే రోజులలో 3780 మంది మరణించారు. దేశంలో ఇంతవరకు కరోనాతో మరణించడం ఇదే ప్రథమమని వైద్య ఆరోగ్యశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
Also Read:ఇండియాలో కరోనా జోరు: ఒక్క రోజులోనే రికార్డుస్థాయిలో మరణాలు
గత 24 గంటల్లో 3,82,315 కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు మూడు లక్షలను దాటుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు 2,06,65,148కి చేరుకొన్నాయి. కరోనాతో మరణించిన రోగుల సంఖ్య దేశంలో2,26,188కి చేరుకొంది.
కేసుల సంఖ్య పెరుగుతున్నా రికవరీ కేసుల సంఖ్య పెరుగుతుంది. మంగళవారం నాడు ఒక్క రోజునే 3,38,439 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 1,69,51,731కి చేరుకొంది.
దేశంలో ప్రస్తుతం 34,87,229కి ఎగబాకింది.దేశంలో కరోనా కేసుల ఉధృతిని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని డిమాండ్ ఉంది. అయితే పలు రాష్ట్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో 51,880 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 48.22కి చేరుకొంది. కరోనాతో నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 891 మంది మరణించారు.