ఇండియాలో కరోనా జోరు: ఒక్క రోజులోనే రికార్డుస్థాయిలో మరణాలు
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనాతో ఒకే రోజులలో 3780 మంది మరణించారు. దేశంలో ఇంతవరకు కరోనాతో మరణించడం ఇదే ప్రథమమని వైద్య ఆరోగ్యశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనాతో ఒకే రోజులలో 3780 మంది మరణించారు. దేశంలో ఇంతవరకు కరోనాతో మరణించడం ఇదే ప్రథమమని వైద్య ఆరోగ్యశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో 3,82,315 కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు మూడు లక్షలను దాటుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు 2,06,65,148కి చేరుకొన్నాయి. కరోనాతో మరణించిన రోగుల సంఖ్య దేశంలో2,26,188కి చేరుకొంది.
కేసుల సంఖ్య పెరుగుతున్నా రికవరీ కేసుల సంఖ్య పెరుగుతుంది. మంగళవారం నాడు ఒక్క రోజునే 3,38,439 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 1,69,51,731కి చేరుకొంది. దేశంలో ప్రస్తుతం 34,87,229కి ఎగబాకింది.దేశంలో కరోనా కేసుల ఉధృతిని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని డిమాండ్ ఉంది. అయితే పలు రాష్ట్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో 51,880 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 48.22కి చేరుకొంది. కరోనాతో నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 891 మంది మరణించారు.
మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదౌతున్నాయి. బెంగుళూరులో సుమారు 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. దీంతో నగరంలోని పలు ఆసుపత్రుల్లో బెడ్స్ , ఆక్సిజన్ కొరత నెలకొంది. రాష్ట్రంలో తాజాగా 44, 631 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 16.9 లక్షలకు చేరుకొన్నాయి.
కేరళ రాష్ట్రంలో 37,190 కేసులు నమోదయ్యాయి. 57 మంది కరోనాతో మరణించారు. ఈ నెల 9 నుండి రాష్ట్రంలో కఠినమైన ఆంక్షలను అమలు చేయనుంది ప్రభుత్వం.అసోం రాష్ట్రంలో ఇప్పటివరకు ఏనాడూ నమోదు కాని కరోనా డెత్స్ రికార్డయ్యాయి. ఒక్క రోజులోనే 41 మంది చనిపోయారు. మరోవైపు 4475 మంది కరోనాబారినపడ్డారు.