మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. మొత్తం మీద ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ రాజీనామా చేసినవారిలో ఉన్నారు.

అన్ని వర్గాలకు సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త మంత్రివర్గంలో 13 మంది న్యాయవాదలు, 6గురు వైద్యులు, 5గురు ఇంజనీర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పీహెడ్ీ, ఎంబీఏవంటి ఉన్నత విద్యావంతులకు మోదీ ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది.
పలువురు మంత్రుల రాజీనామా: నేడే కేంద్ర మంత్రివర్గ విస్తరణ
ముగ్గురు ఎస్టీలు, ఇద్దరు ఎస్సీలకు కేబినెట్ హోదా ఇవ్వబోతున్నట్లు సమాచారం. సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్ లకు పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురికి పదోన్నతి లభించే అవకాశం ఉందని జాతీయ మీడియా చెప్తోంది. తెలుగు తేజం జి. కిషన్ రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నారని చెబుతున్నారు.
ఎన్డీయే కూటమిలో అప్నాదళ్ (ఎస్) అనుప్రియ పటేల్ కు మంత్రి పదవి లభించబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులు బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.