Asianet News TeluguAsianet News Telugu

లంచ్ బ్రేక్, టీ బ్రేక్‌లతోపాటు ఇకపై యోగా బ్రేక్ కూడా.. ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించిన కేంద్రం

ఉద్యోగుల భౌతిక, మానిసక ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం యోగా బ్రేక్ ప్రొటోకాల్, అప్లికేషన్‌ రూపొందించింది. ఉద్యోగులందరూ ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పనిచేసే చోట ఐదు నిమిషాలు వై(బ్రేక్) తీసుకుని ‘ఆసన, ప్రాణాయామ, ధ్యాన’ చేయాలని భావిస్తున్నది. ఈ నెల 30 నుంచి ఉద్యోగులు వై బ్రేక్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, ప్రైవేటురంగానికి విస్తరించాలని యోచిస్తున్నది.
 

union govt launched yoga break app, wants employees to use this mobile app and take five minutes y-break
Author
New Delhi, First Published Sep 4, 2021, 7:01 PM IST

న్యూఢిల్లీ: ఇంతకాలం పనిచోట లంచ్ బ్రేక్, టీ బ్రేక్‌లను విన్నాం. ముందు ముందు యోగా బ్రేక్ అనే పదాన్నీ వినబోతున్నాం. అవును.. కేంద్ర ప్రభుత్వం అందుకోసం అడుగులు వేస్తున్నది. పనిచోసే చోట ఉద్యోగులు ఒత్తిడిని అధిగమించి ఫోకస్ పెంచుకోవడానికి, భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ వై(యోగా)-బ్రేక్ ప్రొటోకాల్ రూపొందించింది. అందుకు అనుకూలంగా మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే పర్సన్నల్, ట్రైనింగ్ మంత్రిత్వ శాఖ(డీవోపీటీ) అన్ని శాఖలకు ఆదేశాలు పంపింది. తమ ఉద్యోగుల్లో యోగా బ్రేక్‌పై అవగాహన కలిగించాలని తెలిపింది.

ఈ మొబైల్ యాప్‌ను కేంద్రం ఇటీవలే లాంచ్ చేసింది. సెప్టెంబర్ 30 నుంచి ఈ యాప్ వినియోగం అందుబాటులోకి రానున్నట్టు తెలిసింది. 30వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఐదు నిమిషాల పాటు యోగా బ్రేక్ తీసుకోవచ్చు. ‘ఆసన, ప్రాణాయామ, ధ్యాన’ల కోసం ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోనున్నారు. ఐదు నిమిషాల యోగా ప్రోటోకాల్ ఈ యాప్‌లో నిక్షిప్తం చేసి ఉంటుంది.

ఈ సంస్కృతిని కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు పరిమితం చేయాలని కేంద్రం భావించడం లేదు. క్రమంగా ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగులు యోగా బ్రేక్ తీసుకుని మానసికంగా పనికి మరింత సంసిద్ధం కావడానికి ఈ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తున్నది. వై-బ్రేక్‌పై అవగాహన, వినియోగంపై అన్ని శాఖలు తమ ఉద్యోగులకు వివరించాలని డీవోపీటీ ఆదేశించింది. ఈ యాప్‌ను ప్రమోట్ చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటురంగంలో దీని వినియోగం పెరగడానికి పూనుకోవాలని ఈ నెల 2న జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది.

ఇటీవలే డీవోపీటీ మంత్రి జితేంద్ర ప్రసాద్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సహా ఆరుగురు కేంద్రమంత్రులు హాజరైన ఓ సమావేశంలో వై-బ్రేక్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలోనే కేంద్రమంత్రి జితేంద్ర ప్రసాద్ ఈ యాప్ వినియోగానికి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించాలని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును కోరారు. తద్వారా ఈ యాప్ వినియోగం పెరుగుతుందని వివరించారు. సాఫ్ట్‌వేర్ సహా చాలా ప్రైవేటు రంగాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, అటువంటి వారందరికీ ఈ ప్రొటోకాల్ ఎంతో ఉపకరిస్తుందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios