న్యూఢిల్లీ: ఏపీకి లభించాల్సిన సహయం అందలేదని ఎస్పీ ఎంపీ అభిప్రాయపడ్డారు.  ఏపీ రాష్ట్రానికి  జనాభా ప్రాతిపదికన  రెవిన్యూ  అందలేదన్నారు.  తక్కువ జనాభా ఉన్న తెలంగాణకు ఎక్కువ నిధులు, ఎక్కువ జనాభా ఉన్న ఏపీకి తక్కువ నిధులు వచ్చినట్టుగా టీడీపీ ఎంపీలు ఇచ్చిన బుక్‌లెట్‌లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టంపై రాజ్యసభలో  మంగళవారం నాడు జరిగిన చర్చలో  ఎస్పీ ఎంపీ రామ్‌ గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. పంజాబ్, హార్యానా రాష్ట్రాలు  విడిపోయినా సట్లేజ్ నది  జలాలు అందలేదన్నారు. 

కృష్ణా, గోదావరి నది జలాల విషయమై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదాలు ప్రారంభమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో  ఏ రకమైన సమస్యలు వచ్చాయో చూసినట్టు చెప్పారు. ఏపీ రాష్ట్ర విభజన సమయంలో కూడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని కోరినట్టు ఆయన గుర్తు చేశారు 

దేశంలో కొన్ని రాష్ట్రాల విభజన జరిగిన సమయంలో మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఏపీని అన్ని రకాలుగా ఆదుకొంటామని  ప్రధానమంత్రి ఇచ్చిన హమీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

రాజధాని నిర్మాణం కోసం  నిధులు ఇస్తామని ఇచ్చిన హమీని కూడ కేంద్రం నిలుపుకోలేదని  టీడీపీ ఎంపీలు తనకు ఇచ్చిన బుక్‌లెట్లలో ఉందని రామ్ గోపాల్ యాదవ్ అభిప్రాయపడ్డారు.