ప్రముఖ సామాజికవేత్త, గాంధేయవాది అన్నాహజారే ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. కేంద్రంలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని తన చిరకాల స్వప్పాన్ని నెరవేర్చుకున్నారు. లోక్‌పాల్‌ను నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. లోక్‌పాల్ నియామక ప్రక్రియకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రముఖ సామాజికవేత్త, గాంధేయవాది అన్నాహజారే ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. కేంద్రంలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని తన చిరకాల స్వప్పాన్ని నెరవేర్చుకున్నారు.
లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం కలిగినా ఇంతవరకు నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో ఆయన తన స్వగ్రామంలో దీక్షకు దిగారు. లోక్‌పాల్‌ను నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. లోక్‌పాల్ నియామక ప్రక్రియకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
లోక్‌పాల్ అర్హతలు:
లోక్‌పాల్ ఛైర్మన్ పదవికి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తిగా పనిచేసిన వారు. లేదా అవినీతి వ్యతిరేక విధానాలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, న్యాయశాస్త్రం, మేనేజ్‌మెంట్ తదితర రంగాల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసిన వారు అర్హులు
* లోక్‌పాల్‌లో ఛైర్మన్‌తో పాటు ఎనిమిది మంది సభ్యులు. వీరిలో నలుగురికి న్యాయశాస్త్రంలో అనుభవం కలిగి ఉండాలి
* ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళల నుంచి నలుగురికి సభ్యులుగా అవకాశం
* ఛైర్మన్ పదవీకాంల ఐదేళ్లు.
* ఛైర్మన్ జీతభత్యాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా ఉంటాయి.
* సభ్యులకు సుప్రీం న్యాయమూర్తితో సమానంగా చెల్లిస్తారు.
* లోక్‌పాల్ సభ్యులు ఇతర లాభదాయక పదవుల్లో ఉండరాదు, ఎన్నికల్లో పోటీ చేయరాదు.
* లోక్‌పాల్ ఎంపిక కమిటీలో సభ్యులుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత
