Asianet News TeluguAsianet News Telugu

మోడీ హయాంలో లీకేజ్‌లు లేవు.. కేంద్రం ఎంత ఇస్తే అంత నేరుగా పేదల ఖాతాల్లోకి : నిర్మల

ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో సంక్షేమ పథకాల అమలులో లీకేజ్‌లు లేవన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పుడు కేంద్రం ఎంత విడుదల చేస్తే అంతే మొత్తం నేరుగా ప్రజలకు చేరుతోందని ఆర్ధిక మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

union finance minister nirmala sitharaman praises pm modi over welfare schemes implementation
Author
First Published Sep 17, 2022, 4:16 PM IST

దేశంలో ప్రతి ఒక్కరి ఆర్ధిక, ఆరోగ్య పరిస్ధితిని మెరుగు పరిచేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని ప్రశంసించారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు నేరుగా పేదలకు అందేలా నగదు బదిలీ అమలు చేస్తున్నామన్నారు. గతంలో కేంద్రం 100 విడుదల చేస్తే.. ప్రజలకు రూ.15 మాత్రమే అందేదని నిర్మలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కేంద్రం ఎంత విడుదల చేస్తే అంతే మొత్తం నేరుగా ప్రజలకు చేరుతోందని ఆర్ధిక మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మోడీ పథకాల్లో ఎక్కడా లీకేజ్ లేదన్నారు. 

ప్రతి ఒక్కరిని జన్ ధన్ ఖాతాలతో బ్యాంకులను దగ్గర చేశారని నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. ముద్ర పథకం ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేకుండా చిన్న తరహా వ్యాపారులకు లోన్లు అందుతున్నాయని ఆమె తెలిపారు. అలాగే ప్రతి కుటుంబానికి సొంతిల్లు అందించాలని మోడీ శ్రమిస్తున్నారని.. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఇళ్లను మంజూరు చేసిన విషయాన్ని నిర్మల  గుర్తుచేశారు. 

అంతకుముందు నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విడుదల చేశారు. చీతా ప్రాజెక్టులో భాగంగా ఈ చీతాలను నమీబియా నుంచి కేంద్రం భారత్‌కు 8 చిరుతలను తీసుకొచ్చింది. తన జన్మదిన సందర్బంగా ప్రధాని మోదీ వాటిని నేడు కూనో నేషనల్‌ పార్క్‌లో రెండు చీతాలను ఎన్‌క్లోజర్ల నుంచి విడుదల చేశారు. అనంతరం మోదీ వాటిని ఫొటోలు తీశారు. తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ..  1952లో దేశం నుంచి చీతాలు అంతరించిపోయాయని ప్రకటించడం దురుదృష్టకరమని చెప్పారు. అయితే దశాబ్దాలుగా వాటికి పునరావాసం కల్పించడానికి ఎటువంటి అర్ధవంతమైన ప్రయత్నం జరగలేదని చెప్పారు. 

Also REad:ప‌రిశ్ర‌మ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విద్యార్థుల‌ను త‌యారు చేయాలి - ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

1952లో దేశం నుంచి చీతాలు అంతరించిపోయాయని మేము ప్రకటించడం దురదృష్టకరం, కానీ దశాబ్దాలుగా వాటికి పునరావాసం కల్పించడానికి ఎటువంటి అర్ధవంతమైన ప్రయత్నం జరగలేదు. నేడు మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నందున.. దేశం కొత్త శక్తితో చీతాలకు పునరావాసం కల్పించడం ప్రారంభించిందని మోదీ తెలిపారు. కునో నేషనల్ పార్క్‌లో ఈ చీతాలకు చూడడానికి ప్రజలు ఓపిక పట్టాలి అన్నారు. కొన్ని నెలలు వేచి ఉండాలని కోరారు. 

‘‘ఈ చీతాలు ఈ ప్రాంతానికి తెలియకుండానే అతిథులుగా వచ్చాయి. అవి కునో నేషనల్ పార్క్‌ను తమ నివాసంగా మార్చుకోవడానికి.. మనం ఈ చిరుతలకు కొన్ని నెలల సమయం ఇవ్వాలి. అంతర్జాతీయ మార్గదర్శకాలను అనుసరించి.. ఈ చీతాలు  సెటిల్ అవ్వడానికి భారతదేశం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మన ప్రయత్నాలు విఫలం కాకూడదు’’ అని మోదీ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios