న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకుల విలీనంపై కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. దేశవ్యాప్తంగా ఉన్న 18 జాతీయ బ్యాంకుల్లో 14 బ్యాంకులు లాభాల బాటలో ఉన్నట్లు తెలిపారు.  

బ్యాంకుల నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. 8.65లక్షల కోట్ల నుంచి రూ.7.9లక్షల కోట్లకు ఎన్ పీఏలు తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. బ్యాంకుల సంస్కరణలో భాగంగా ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం కానున్నట్లు స్పష్టం చేశారు. 

మరోవైపు కెనెరా బ్యాంకు సిండికేంట్ బ్యాంకులో విలీనం కానున్నట్లు స్పష్టం చేశారు. ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ లు సైతం విలీనం కానున్నట్లు తెలిపారు.  వీటితోపాటు యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ లో విలీనం కానున్నట్లు తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయాబ్యాంక్‌, దేనా బ్యాంకుల విలీనం ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే ప్రస్తుతం ఉన్న 27 బ్యాంకులలో విలీన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. విలీన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత 12 బ్యాంకులు మాత్రమే ఉండనున్నట్లు తెలిపారు. ఇకపోతే బ్యాంకింగ్ రుణాల వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదని  తేల్చి చెప్పారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.  

ఇకపోతే బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు వేగవంతం చేసేందుకు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రోజులతరబడి లబ్ధిదారులు తిరగనవసరం లేకుండా 59 నిమిషాల్లో లోన్‌ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  

బ్యాంకింగ్‌లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నిర్మూలించబోతున్నట్లు తెలిపారు. బ్యాంకుల ఎండీల ఎంపికలో రాజకీయ ప్రమేయం లేకుండా చూస్తామన్నారు. ఎస్‌బీఐ తరహాలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ విధానాన్ని మిగిలిన జాతీయ బ్యాంకుల్లోనూ తీసుకొస్తున్నట్లు తెలిపారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

రుణ ఎగవేతదారులను వదలం, షెల్ కంపెనీలపై కొరడా: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్