న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక మార్పులు అవసరమని అందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటికే 3ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అదిగమనించామని త్వరలోనే 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. 

కేంద్ర ప్రభుత్వం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తోందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా సమూల మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. 

ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారీ ప్రాజెక్టులకు రుణాలు తెచ్చే అంశంలో బ్యాకుల కన్సార్షియం వ్యవస్థల్లో మార్పులు తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఆర్థిక నేరగాళ్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 

దేశం విడిచిపెట్టి వెళ్లిపోయే రుణ ఎగవేత దారులు ఆటలు కట్టించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. షెల్ కంపెనీలపై కొరడా ఝులిపించినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 3లక్షల 38వేల షెల్ కంపెనీలను మూసి వేసినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్.