Budget 2022: ప్రాంతీయ భాషల్లో ఈ విద్య.. డిజిటల్ వర్సిటీ.. 200ల పీఎం ఈ విద్యా ఛానెళ్లు: నిర్మలా సీతారామన్
Budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..పీఎం ఈ-విద్య ద్వారా ప్రసారం చేస్తున్న ‘ఒక తరగతి, ఒక టీవీ చానెల్’ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్న 12 నుండి 200 టీవీ చానెళ్లకు విస్తరిస్తామని తెలిపారు. డిజిటల్ వర్సిటీని సైతం ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతున్నామని ప్రకటించారు.
Budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..పీఎం ఈవిద్య ద్వారా ప్రసారం చేస్తున్న ‘ఒక తరగతి, ఒక టీవీ చానెల్’ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్న 12 నుండి 200 టీవీ చానెళ్లకు విస్తరిస్తామని తెలిపారు. డిజిటల్ వర్సిటీని సైతం ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. డిజిటల్ విద్య, నైపుణ్యం కార్యక్రమాలను పెంపొందించడంపై దృష్టి పెట్టామని తెలిపారు. దేశంలో విద్య అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటుమన్నామని తెలిపారు.
అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామనీ, ఈ విద్యను అందించేందుకు డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు. హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో వర్సిటీని నిర్మించనున్నామని తెలిపారు. అలాగే, పీఎం ఈవిద్య (PM eVIDYA) ద్వారా ప్రసారం చేస్తున్న ‘ఒక తరగతి, ఒక టీవీ చానెల్’ (One class, One TV channel) కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్న 12 నుండి 200 టీవీ ఛానెళ్లకు విస్తరిస్తామని తెలిపారు. దీంతో అన్ని రాష్ట్రాలు 1 నుండి 12 తరగతి వరకు ప్రాంతీయ భాషలలో అనుబంధ విద్యను అందించడానికి ఇది వీలు కల్పిస్తుంది చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ కారణంగా చదువులకు దూరం కాకుండా పిల్లలు విద్యను అందించేందుకు వీలు పడుతుందని తెలిపారు.
దీనితో పాటు, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్.. డైనమిక్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. పౌరులలో సంబంధిత ఉద్యోగాలు, వ్యవస్థాపక అవకాశాలను కనుగొనడానికి వీలుగా డిజిటల్ ఎకోసిస్టమ్ ఫర్ స్కిల్లింగ్ & లైవ్లీహుడ్ ఇ-పోర్టల్ ప్రారంభింస్తామని పేర్కొన్నారు. Udyam, e-shram, NCS, Aseem పోర్టల్స్ వంటి MSMEలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తామన్నారు. అలాగే, వీటి పరిధిని మరింతగా విస్తరిస్తామని చెప్పారు. దీంతో అవి GC, BC & BB సేవలను అందించే లైవ్ ఆర్గానిక్ డేటాబేస్‌లతో క్రెడిట్ ఫెసిలిటేషన్, ఎంటర్‌ప్రెన్యూర్ అవకాశాలను మెరుగుపరిచే పోర్టల్‌లుగా పని చేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు.
అలాగే, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగం యువతకు ఉపాధి కల్పించడానికి అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుందని నిర్మాలా సీతారామన్ తెలిపారు. దీంతో ఆయా రంగాల మార్గాలను సిఫార్సు చేయడానికి, మార్కెట్‌లకు, ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా సేవలందించడానికి, దేశీయ ఏవీజీసీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అన్ని వాటాదారులతో కలిసి ఏవీజీపీ ప్రమోషన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అలాగే, వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పించడమే ప్రభుత్వ తదుపరి లక్ష్యం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వృద్ధిరేటులో మనం ముందున్నామని తెలిపారు. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించామని పేర్కొన్నారు. పిఎం గతి శక్తి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతుందనీ, యువతకు మరిన్ని ఉద్యోగఅవకాశాలకు దారి తీస్తుందఅన్నారు.
- Budget 2022
- Digital University
- Halwa ceremony
- India
- New Delhi
- Nirmala Sitharaman
- One class One TV channel
- budget
- digital education
- economy
- education Budget
- finance minister
- financial statement
- green Budget
- printing
- ఎకానమీ
- కేంద్ర ఆర్థిక మంత్రి
- గ్రీన్ బడ్జెట్
- డిజిటల్ ఎడ్యుకేషన్
- నిర్మలా సీతారామన్
- బడ్జెట్
- బడ్జెట్ 2022
- విద్యా