Bhopal: మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) పేరుతో ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. "నేడు యూసీసీ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. రాజ్యాంగం కూడా సమాన హక్కుల గురించి చెబుతుంది... సుప్రీంకోర్టు కూడా యూసీసీని అమలు చేయాలని కోరింది. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని" మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ ను సమర్థిస్తున్న వారు ముస్లిం కూతుళ్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు.
PM Modi bats for uniform civil code: భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం బలమైన వాదనను వినిపించారు.. ఇది రాజ్యాంగంలో ఊహించబడిందనీ, దానిని అమలు చేయాలని సుప్రీంకోర్టు కోరిందని తెలిపారు. ముస్లిం సమాజాన్ని తప్పుదారి పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు యూసీసీ అంశాన్ని ఉపయోగిస్తున్నారని ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) పేరుతో ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. "నేడు యూసీసీ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. రాజ్యాంగం కూడా సమాన హక్కుల గురించి చెబుతుంది... సుప్రీంకోర్టు కూడా యూసీసీని అమలు చేయాలని కోరింది. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని" మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ ను సమర్థిస్తున్న వారు ముస్లిం కూతుళ్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు.
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) రాజ్యాంగంలో ఊహించబడిందనీ, దానిని అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా కోరిందని, కానీ ఓట్ల కోసం పరితపించే వారు అడ్డుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి, రెచ్చగొట్టడానికి యూసీసీని ఉపయోగిస్తున్నారని కూడా ఆరోపించారు. తమ స్వలాభం కోసం తమను రెచ్చగొడుతున్న వారు ఎవరో భారత ముస్లింలు అర్థం చేసుకోవాలన్నారు. "ఉమ్మడి పౌరస్మృతి పేరుతో కొందరు ఇతరులను (ముస్లింలను) రెచ్చగొట్టడం మనం చూస్తున్నాం. రాజ్యాంగం కూడా పౌరులకు సమాన హక్కుల గురించి చెబుతుంది. వారు (ప్రతిపక్షాలు) మమ్మల్ని నిందిస్తారు, కానీ వారు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని" అన్నారు.
కర్ణాటకలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీ కూడా ఉంది. తాము రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాజ్యాంగం పరిధిలోనే యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేసేందుకు అనుమతి ఉంది. యూసీసీ వైపు అడుగులు వేస్తామని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వారి వల్ల పస్మాండా ముస్లింల జీవితాలు దుర్భరంగా మారాయనీ, వారిని సమానంగా చూడడం లేదని ప్రధాని మోడీ అన్నారు. తమ సామాజికవర్గానికి చెందిన వారే వారిని దోపిడీ చేశారని ఆయన పార్టీ కార్యకర్తలతో జరిపిన ముఖాముఖిలో పేర్కొన్నారు. ముస్లింలలో వెనుకబడిన వర్గాలను పస్మాండా ముస్లింలుగా అభివర్ణిస్తారు. ముస్లిం మహిళల గురించి మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ ను సమర్థించే వారు ముస్లిం ఆడపిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. సామాజిక న్యాయం పేరుతో ఓట్లు అడిగే వారు గ్రామాలకు, పేదలకు తీరని అన్యాయం చేశారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇదిలావుండగా, ప్రధాని మోడీ మంగళవారం భోపాల్ లో ఐదు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు దేశ ఆర్థిక కనెక్టివిటీని పెంచుతాయని అన్నారు.
