లక్నో:న్యూఢిల్లీలోని లోధి ఎస్టేట్ లో ఉన్న బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్రం నుండి నోటీసు అందుకొన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కొత్త రాజకీయ వ్యూహానికి తెర తీయబోతున్నారు. 

ప్రియాంకగాంధీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి  తన మకాం మార్చనున్నారు. లక్నోలో బంగ్లా తీసుకొని అక్కడే ఉండాలని భావిస్తున్నట్టుగా ప్రియాంకగాంధీకి అత్యంత సన్నిహితులు చెబుతున్నారు.

2022 లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని లక్నో కేంద్రంగా తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకొనేందుకు ఆమె పావులు కదుపుతున్నారు.

2022లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని లక్నోలోని 'కౌల్ హౌస్' కు ఆమె తన నివాసాన్ని మార్చనున్నారు. ఈ బంగ్లా ఇందిరాగాంధీ బంధువు షీలా కౌల్ కు చెందింది. షీలా కౌల్ గతంలో కేంద్ర కేబినెట్ లో పనిచేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలు. కౌల్ హౌస్ మరమ్మత్తులు ఇప్పటికే పూర్తి చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆమె తన నివాసాన్ని యూపీకి మార్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు. శ్రేణులతో చర్చించేందుకు సమావేశాలు నిర్వహించేందుకు ఎక్కువ సమయం గడపాలంటే యూపీలోనే నివాసం ఉండాలని ఆమె భావిస్తున్నారు. 

ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకొన్న తర్వాత ఇందిరాగాంధీ చార్ బాగ్ రైల్వే స్టేషన్ సమీపంలోని బంగ్లాలో నివాసం ఉంది.కేంద్ర ప్రభుత్వం  బంగ్లాను ఖాళీ చేయాలని బుధవారం నాడు ప్రియాంక గాంధీకి నోటీసు ఇచ్చింది. ఆగష్టు 1వ తేదీ లోపుగా ఈ బంగ్లాను ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొంది.

కేంద్ర హోంశాఖ జూన్ 30వ తేదీన ప్రియాంక గాంధీకి నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులో ఎస్పీజీ సెక్యూరిటీ లేనందున ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలని కోరింది.

1997 ఫిబ్రవరి 21వ తేదీన ప్రియాంకగాంధీకి లోధి ఏస్టేట్ లోని 35 నెంబర్ బంగ్లాను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఎస్పీజీ రక్షణ ఉన్నందున ఆమెకు ఈ భవనం కేటాయించారు.

ప్రభుత్వ భవనం ఉపయోగించినందున జూన్ 30వ తేదీ వరకు ప్రియాంకగాంధీ రూ.3,46,677 బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను చెల్లించాలని కూడ ఆ నోటీసులో కోరింది.