Asianet News TeluguAsianet News Telugu

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఛోటా రాజన్ బతికేవున్నాడు: ఎయిమ్స్ వర్గాలు

అండర్ వరల్డ్ డాన్, కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ మరణించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. కోవిడ్-19తో బాధపడుతున్న ఆయనను ఏప్రిల్ 26న అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో చేర్పించి, చికిత్స చేయిస్తున్న సంగతి తెలిసిందే. 

under world don chota rajan still alive says aiims official ksp
Author
New Delhi, First Published May 7, 2021, 7:34 PM IST

అండర్ వరల్డ్ డాన్, కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ మరణించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. కోవిడ్-19తో బాధపడుతున్న ఆయనను ఏప్రిల్ 26న అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో చేర్పించి, చికిత్స చేయిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయారని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అయితే, కాసేపటి తర్వాత దీనిపై స్పందించిన ఎయిమ్స్ వర్గాలు ఛోటా రాజన్ మరణించలేదు, ఆయన సజీవంగానే ఉన్నారని తెలిపాయి. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ ఈ మేరకు ట్వీట్ చేసింది. 

62 ఏళ్ల చోటా రాజన్  తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న సమయంలో కరోనా సోకింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ కు తరలించారు. 2015లో ఇండోనేషియాలో చోటా రాజన్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.  ఆయనపై 70కి పైగా కేసులు  నమోదయ్యాయి.

Also Read:కరోనా: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి

చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్. తొలుత దావూద్ ఇబ్రహీం అనుచరుడుగా ఉన్నాడు. దావూద్ తో విబేధాల కారణంగా చోటా రాజన్ మరో గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని ప్రత్యర్ధిగా మారాడు.

ముంబై పోలీసులు, భారత నిఘా ఏజెన్సీలు అతని కోసం దాదాపు రెండు దశాబ్దాలు పాటు అన్వేషణ సాగించాయి. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్న ఛోటారాజన్‌ను ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారంతో 2015లో ఇండోనేషియా అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకొచ్చారు భారత అధికారులు. 

Follow Us:
Download App:
  • android
  • ios