Asianet News TeluguAsianet News Telugu

కరోనా: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి

కరోనాతో చికిత్స పొందుతూ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ శుక్రవారం నాడు మరణించారు. 

Underworld don Chhota Rajan dies due to Covid-19 at AIIMS lns
Author
New Delhi, First Published May 7, 2021, 3:57 PM IST

న్యూఢిల్లీ: కరోనాతో చికిత్స పొందుతూ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ శుక్రవారం నాడు మరణించారు. కరోనా కారణంగా ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా సోకిన చోటా రాజన్ ను చికిత్స నిమిత్తం ఈ ఏడాది ఏప్రిల్ 26న  ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. 2015లో ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఆయనను భారీ బందోబస్తు మధ్య తీహార్ జైల్లో  శిక్షను అనుభవిస్తున్నాడు. 

 

 

 

62 ఏళ్ల చోటా రాజన్  తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న సమయంలో కరోనా సోకింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ కు తరలించారు. 2015లో ఇండోనేషియాలో చోటా రాజన్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.  ఆయనపై 70కి పైగా కేసులు  నమోదయ్యాయి.చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్. తొలుత దావూద్ ఇబ్రహీం అనుచరుడుగా ఉన్నాడు. దావూద్ తో విబేధాల కారణంగా చోటా రాజన్ మరో గ్యాంగ్ ఏర్పాటు చేసుకొన్నాడు. ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటా రాజన్ కు వీఐపీ ట్రీట్‌మెంట్ అందిందనే  విషయమై విమర్శలు చెలరేగాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios