మహారాష్ట్రలోని పుణెలో గురువారం అర్థరాత్రి దాటిన తరువాత విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం హఠాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో ఆ సమయంలో పనిలో ఉన్న కార్మికులు ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీనిమీద ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : Maharashtraలోని పూణేలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో కార్మికులు death అవ్వడం మీద ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు.
"పుణెలో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన దుర్ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని ప్రధాని Narendra Modi ట్వీట్ చేశారు.
పూణేలో నిర్మాణంలో ఉన్న భవనం గురువారం అర్థరాత్రి కూలిపోవడంతో ఐదుగురు workers మృతి చెందగా, పలువురు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. "భవన నిర్మాణంలో భాగంగా ఇనుప కడ్డీలు బిగించే పని చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా బిల్డింగ్ కూలడంతో దీని కింద పని చేస్తున్న పదిమంది కార్మికులు అక్కడ చిక్కుకు పోయారు" అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ గిల్బైల్ చెప్పారు.
ఘటనా స్థలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో "ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రదేశంలో ముందు జాగ్రత్త చర్యలు లేవని ప్రాథమిక నివేదికలో తేలింది" అని పూణే పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిదాస్ పవార్ తెలిపారు. కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
