సారాంశం

గుజరాత్ రాష్ట్రంలోని పాలన్ పూర్ లో నిర్మాణంలో ఉన్న వంతెన  ఇవాళ కుప్పకూలింది.  

గాంధీనగర్:గాంధీనగర్:గుజరాత్ రాష్ట్రంలోని  పాలన్ పూర్ లో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది.   సోమవారంనాడు  బ్రిడ్జిలో ఒక భాగం కుప్పకూలింది.  ఈ ఘటనతో  బ్రిడ్జి శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే  సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.పాలన్ పూర్ లోని ఆర్టీఓ సర్కిల్ ఏరియాలో  ఈ ఘటన చోటు చేసుకుంది.ట్రాక్టర్, ఆటోరిక్షాలపై  బ్రిడ్జి శిథిలాలు పడ్డాయి. సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు హుటాహుటిన చేరుకున్నారు.  సహాయక చర్యలను  ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

 

బ్రిడ్జిలో  కొంత భాగం కూలిపోవడంపై  అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  నాణ్యత సరిగా లేని కారణంగా బ్రిడ్జి కూలిపోయిందా లేక ఇతరత్రా కారణాలున్నాయా అనే విషయాలపై  అధికారులు దర్యాప్తు చేయనున్నారు.