రోగికి స్ట్రెచర్ ఇవ్వని సిబ్బంది.. దుప్పటితో వార్డులోకి లాక్కెళ్లిన బంధువులు

unavailability of a stretcher patient drag with bedsheet
Highlights

రోగికి స్ట్రెచర్ ఇవ్వని సిబ్బంది.. దుప్పటితో వార్డులోకి లాక్కెళ్లిన బంధువులు

చనిపోయిన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కిలోమీటర్ల దూరం నడిచిన భర్త సంఘటన గుర్తుందా.? ఆ ఘటనతో దేశంలోని  ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది అంతులేని నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఈ ఘటన తర్వాత అలాంటివి ఎన్నో జరిగినప్పటికీ ప్రభుత్వాలు అప్పటికప్పుడు హాడావిడి చేసి ఆ తర్వాత మరచిపోతూనే ఉన్నాయి.

తాజాగా కాలు విరిగి వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన మహిళకు స్ట్రెచర్ ఇవ్వలేదు నాందేడ్ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది. ఈ క్రమంలో చేసేది లేక వెంట తెచ్చుకున్న దుప్పటి సాయంతో ఆమెను వార్డులోకి లాక్కెళ్లారు బంధువులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆస్పత్రి వర్గాలు స్పందించాయి.

నిజానికి తాము స్ట్రెచర్ ఇస్తామని.. అయితే అందుకు కొంత సమయం పడుతుందని సిబ్బంది తెలిపారని.. అప్పటి వరకు ఆగని బంధువులు బాధితురాలిని దుప్పటికి కట్టి లాక్కెళ్లారని చెప్పారు. దీనిపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 
 

loader