స్వలింగసంపర్కానికి అలవాటు పడ్డ ఓ ట్యూటర్ తన దగ్గరికి ట్యూషన్ కి వచ్చి బాలుడిని వేధించడం మొదలుపెట్టాడు. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఆ బాలుడు అతడిని హతమార్చాడు.
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ట్యూషన్ టీచర్ లైంగికంగా వేధింపులకు పాల్పడుతుండడంతో విసిగిపోయిన 14 ఏళ్ల బాలుడు దారుణానికి తెగించాడు. ఆ టీచర్ను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. స్వలింగ సంపర్కుడైన ట్యూటర్ 14 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడు.
ఆ బాలుడు అతడి వద్దకు ట్యూషన్ కి వెళ్లేవాడు. అతని మీద కన్నేసిన టీచర్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో పాటు ఓసారి బాలుడితో సన్నిహితంగా ఉంటూ వీడియో కూడా తీశాడు. ఆ వీడియోతో బాలుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్లు వినాలని లేకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం మొదలు పెట్టాడు.
తమిళనాడులో దారుణం.. బీజేపీ నేత మోహన్ రాజ్ కుటుంబానికి చెందిన నలుగురి హత్య..కారణం అదేనా??
దీంతో ఆ బాలుడు తీవ్రంగా భయపడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఘటన జరిగిన రోజున ట్యూషన్ టీచర్ బాలుడిని జామియా నగర్ లోనే తన ఇంటికి రావాలని పిలిచాడు. మళ్లీ తన మీద వేధింపులకు పాల్పడతాడని భావించిన బాలుడు…తన వెంట పదునైన పేపర్ కట్టర్ ను తీసుకువెళ్లాడు.
అక్కడికి వెళ్లిన తర్వాత వేధింపులకు పాల్పడుతున్న ట్యూటర్ ని గొంతు కోసి, అక్కడి నుంచి పారిపోయాడు. అయితే బాలుడు వెళ్లిన చాలాసేపటి తర్వాత గదిలో నుంచి రక్తం బయటికి రావడం ప్రారంభించింది. అది గమనించిన అపార్ట్మెంట్లోని మిగతావారు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. బాలుడితో ఆ ట్యూటర్ చేసిన వీడియో బయటపడింది. బాలుడు మీద అనుమానంతో గాలింపు చేపట్టిన పోలీసులు మూడు రోజుల తర్వాత నిండితుడిని అదుపులోకి తీసుకున్నారు.