ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు భారత్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ముంబై దాడులలో మరణించిన వారికి నివాళులర్పిస్తారు. బాధితులను కలుసుకోనున్నారు.అలాగే.. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ లతో ప్రత్యేక భేటీ కానున్నారు.
ఆంటోనియో గుటెర్రెస్ భారతదేశ పర్యటన: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు. ఆయన ఈ నెల 18 నుంచి 20 వరకు భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఆయన తన పదవీకాలానికి ముందు భారతదేశాన్ని సందర్శించడం విశేషం. ఆయన అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మిషన్ లైఫ్ యొక్క బుక్‌లెట్, ట్యాగ్‌లైన్‌ను విడుదల చేయనున్నారు.
అయితే ముంబైలో 26/11 దాడుల్లో మరణించిన వారికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి నివాళులర్పించడంతో పర్యటన ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 26/11 ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తారు.ఈ సమావేశంతో పాటు IIT ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక్కడ భారతదేశం- ఐక్యరాజ్య సమితి సహకారం అనే అంశంపై ప్రసంగిస్తారు.
ప్రధాని మోదీతో కలిసి గుజరాత్ లో పర్యటన
జనవరి 2022లో ఆయన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గా రెండవసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో అక్టోబర్ 20న గుజరాత్‌లోని కెవాడియాలో మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి)పై బుక్‌లెట్, దాని లోగో, ట్యాగ్‌లైన్ ఆవిష్కరణలో ప్రధాని మోదీతో గుటెర్రెస్ పాల్గొంటారు. గ్లాస్గోలో వాతావరణ మార్పుపై COP26 సందర్భంగా నవంబర్ 2021లో ప్రధాని మోదీ లైఫ్ భావనను ప్రపంచానికి అందించారు.
తన ప్రసంగంలో.. పర్యావరణ అనుకూల జీవనశైలి కోసం అంతర్జాతీయ ప్రజా ఉద్యమాన్నిబుద్ధిహీనంగా కాకుండా బుద్ధిపూర్వకంగా ఉపయోగించుకోవాలని ప్రపంచ సమాజాన్ని ప్రధాని మోడీ కోరారు. విధ్వంసక వినియోగం యొక్క ప్రమాదం నుండి ప్రపంచాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ ఫోరమ్‌లలో వాతావరణ మార్పుల ముప్పుకు వ్యతిరేకంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సమర్థవంతమైన పరిష్కారాలను బలోపేతం చేసే దిశలో మిషన్ లైఫ్ ఏర్పాటు చేయబడింది. ఇందు కోసం భారత్ ప్రత్యేక చొరవ తీసుకుంది. ప్రకృతిని తల్లిగా భావించే భారతదేశపు జానపద తత్వశాస్త్రం దాని ప్రధానాంశం. దీనితో పాటు.. భారతీయులను పర్యావరణ అనుకూలమైనదిగా మారడానికి స్ఫూర్తినిచ్చే సమగ్ర ప్రచారాన్ని రూపొందించడం కూడా దీని లక్ష్యం. తద్వారా వారు తమ దైనందిన జీవితంలో వాతావరణానికి అనుకూలమైన రీతిలో ప్రవర్తిస్తారు.ఇది గ్రహాన్ని రక్షించడానికి భాగస్వామ్య నిబద్ధతను ప్రోత్సహిస్తుంది.
2022 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష పదవి భారత్‌కు రానున్న నేపథ్యంలో సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పర్యటన సాగుతోందనీ, ఈ సందర్భంగా ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో కూడా చర్చలు జరుపుతారు.ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో భారత్‌కు వచ్చే జీ20 చైర్మన్ పదవిపై కూడా చర్చ జరగనుంది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తన గుజరాత్ పర్యటన సందర్భంగా కెవాడియా వెళ్లి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించనున్నారు. ఈ క్రమంలో ఆయన వద్ద పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అదే సమయంలో.. మోధేరా సూర్య దేవాలయాన్ని సందర్శించడానికి కూడా వెళతారు. ఇటీవలే మోధేరాను భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో పనిచేసే గ్రామంగా ప్రకటించారు.
