Asianet News TeluguAsianet News Telugu

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు.. అతిక్ అహ్మద్ ను దోషిగా తేల్చిన స్పెషల్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు

ఉమేష్ పాల్ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ దొోషిగా తేలారు. అతడితో పాటు సోదరుడు అష్రఫ్, మిగిలిన నిందితులను కూడా దోషులుగా తేలుస్తూ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. 

Umesh Pal Kidnapping Case.. Special MP-MLA Court Convicted Atiq Ahmed.. ISR
Author
First Published Mar 28, 2023, 1:47 PM IST

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను దోషిగా నిర్ధారిస్తూ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో అతిక్ తో పాటు అతడి సోదరుడు అష్రఫ్, మిగిలిన నిందితులను కూడా దోషులుగా తేలారు. ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో మొత్తం 10 మంది నిందితులు ఉన్నారు. అతిక్‌ను గుజరాత్‌ నుంచి సోమవారం ప్రయాగజ్‌లోని నైనీ సెంట్రల్ జైలుకు తీసుకురాగా, అష్రాఫ్‌ను బరేలీ నుంచి సిటీ జైలుకు తీసుకొచ్చారు.

కాంగ్రెస్, బీజేపీల‌కు మా బ‌లం ఎంటో తెలుసు.. : పొత్తుల‌పై హెచ్‌డీ కుమారస్వామి కీల‌క వ్యాఖ్య‌లు

గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అతిక్ అహ్మద్ 1989 నుంచి 2004 వరకు అలహాబాద్ వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు ఉత్తరప్రదేశ్ లోని ఫూల్ పూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎంపీగా పనిచేశారు. 1962 ఆగస్టు 10న జన్మించిన అతిక్ అహ్మద్ పేరు వందకు పైగా కేసుల్లో ఉంది. అతడి సోదరుడు అష్రఫ్ పై 52, భార్య షైస్తా ప్రవీణ్ పై 3, కుమారులు అలీ, ఉమర్ అహ్మద్ పై వరుసగా 4, 1 కేసులు ఉన్నాయి.

అతిక్ అహ్మద్ తొలిసారి 1989 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అలహాబాద్ వెస్ట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1993లో సమాజ్ వాదీ పార్టీలో చేరిన ఆయన 1999లో అప్నాదళ్ లో చేరారు. 2003లో అప్నాదళ్ ను వీడి తిరిగి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios