బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకన్నారు. రాష్ట్రపతి భవన్ లో బోరిస్ జాన్సన్ కు ప్రధాని మోడీ స్వాగతం పలికారు.
న్యూఢిల్లీ: రెండు రోజుల Indiaపర్యటనకు వచ్చిన బ్రిటిష్ ప్రధాని Boris Johnson శుక్రవారం నాడు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకొన్నారు. రాష్ట్రపతి భవన్ లో ప్రధాని Narendra Modi బోరిస్ జాన్సన్ కు ఘన స్వాగతం పలికారు.
ఇండియా పర్యటనకు వచ్చిన తనకు అద్భుతమైన స్వాగతం తెలిపినందుకు బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ధన్యవాదాలు చెప్పారు. ఇండియా, Britain మధ్య ఇంతవరకు పరిస్థితులు బలంగా లేవన్నారు. ఇప్పుడున్నంత మంచిగా ఉన్నాయని తాను అనుకోవడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రపతి భవన్ చేరుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ New Delhi లోని రాజ్ ఘాట్ వద్ద పుష్పగుచ్చం ఉంచి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాతో వ్యూహాత్మక రక్షణ, దౌత్య, ఆర్ధిక భాగస్వామ్యంపై చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ లో సన్నిహిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు భద్రతా సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఉండనుంది.
బోరిస్ జాన్సన్ గురువారం నాడు అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు స్వాగతం పలికారు. బ్రిటన్ ప్రధానితో భారత విదేశంగా మంత్రి ఎస్ . జైశంకర్ కూడా చర్చలు జరపనున్నారు.
రెండు రోజుల ఇండియా పర్యటనకు బ్రిటీష్ ప్రధాని గురువారం నాడు వచ్చారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో బోరిస్ జాన్సన్ పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.
సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, ఆరోగ్య రంగానికి చెందిన పలు అంశాలపై ఇండియా, బ్రిటన్ మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఈ ఒప్పందాల వల్ల 11 వేల ఉద్యోగాలు దక్కనున్నాయి. 5జీ టెలికాం, కృత్రిమ మేథ మొదలు ఆరోగ్య పరిశోధన, పునరుత్పాదన, ఇంధన వనరులు వంటి అనేక అంశాల్లో భారత, బ్రిటన్ లు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ సంక్షోభం వంటి కీలక అంశాలపై కూడా జాన్సన్, మోడీ చర్చించే అవకాశం ఉంది.
