PM Modi: ఉజ్వల లబ్దిదారుల ఇంట్లో టీ తాగిన ప్రధాని.. ‘చాయ్‌‌వాలాగా నాకు తెలుసు’.. ముచ్చట్లు ఇలా..

ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన అయోధ్యలోని మీరా కుటుంబాన్ని ప్రధాని మోడీ కలిశారు. ఆమె ఇంట్లో చాయ్ తాగి.. ఆమె కుటుంబంతో ముచ్చటించారు. చాయ్ తాగి.. నేను కూడా చాయ్‌వాలానే అని అన్నారు.
 

Ujjwala yojana scheme beneficiary meera family and pm narendra modi full discussion here after tea kms

Ayodhya: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు అయోధ్య నగరానికి వెళ్లారు. ఈ రోజు రైల్వే కొత్తగా రూపుదిద్దిన రైల్వే స్టేషన్, కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలోనే ఉజ్వల యోజన లబ్దిదారుల ఇంటికి వెళ్లారు. అక్కడ టీ తాగి వారితో ముచ్చటించారు.

అయోధ్యకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీరా ఇంటికి వెళ్లారు. మీరా కుటుంబం ప్రధాని మోడీకి ఆత్మీయ స్వాగతం పలికారు. మీరు మా ఇంటికి రావడం సంతోషంగా ఉన్నదని వారు చెప్పారు. ‘నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? మీ ఇంటికే ఎందుకు వచ్చానో తెలుసా?’ అని ప్రధాని మోడీ అడిగారు. అందుకు తెలుసు అన్నట్టుగా మీరా తల ఊపారు.

‘దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన కింద మేం పది కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. పదవ కోటి కనెక్షన్ మీకు వచ్చింది. ఈ చివరి కనెక్షన్ పొందిన వారితో నేను మాట్లాడాలని అనుకున్నాను. ఆరా తీస్తే.. ఆ లబ్దిదారు కూడా అయోధ్య అనే తేలింది. ఛలో..  మీరా ఇంటికి వెళ్లివద్దామనే వచ్చాను’ అని ప్రధాని అన్నారు. ఈ సంభాషణ ఇలా సాగింది.

Also Read: DSP Nalini: ఉద్యమబాట నుంచి ఆధ్యాత్మిక మార్గం.. సీఎంను కలిశాక మాజీ డీఎస్పీ నళిని కామెంట్

‘సంతోషం. మీరు వచ్చినందుకు ఆనందంగా ఉన్నది’ అని మీరా అన్నది.

‘మరి నాకోసం ఏం వండిపెడతారు?’ అని ప్రధాని మోడీ అడిగారు.

‘ఇవాళ పప్పు, అన్నం వండాను. మీ కోసం చాయ్ చేసి పెట్టాను’

‘చాయ్ చేశారా? మరి నాకు ఇవ్వండి’ అని ప్రధాని అనగానే ఆమె ఓ కప్‌లో చాయ్ పోసి ప్రధానికి అందించింది.

ఆ చాయ్ తాగుతూ.. ‘మీరు చాయ్ బాగా తీపిగా తాగుతున్నారే..’ అని అన్నారు. 

‘ఇప్పుడు చెప్పండి. నా ద్వారా మీకు ఏయే ప్రయోజనాలు దక్కాయి?’ అని ప్రధాని అడిగారు.

‘ఈ ఆవాసం(పీఎం ఆవాస్ యోజన) దక్కింది’

‘ఆ.. ఈ ఆవాసం దక్కిందా.. మీరు అనుకున్నట్టుగా కట్టుకున్నారా?’

‘ఔను’

‘అంతకు ముందు ఎక్కడ ఉండేవారు?’

‘ఇక్కడే కవర్లు, బట్టలతో ఉండే ఓ చిన్న జోప్డీలో ఉండేవాళ్లం’

‘కరెంట్ ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు?’

‘మూడు సంవత్సరాలు అవుతున్నది’

‘ఎంత బిల్లు వస్తున్నది?’

‘150, 200 రూపాయల వరకు వస్తుంది’

‘ఉచిత బియ్యం వస్తున్నాయా?’

Also Read: TDP: ఏపీలో తెలంగాణ ట్రెండ్.. చంద్రబాబు, పవన్ రెండు స్థానాల్లో పోటీ? అల్లుడి కోసం సీటు త్యాగం!

‘పది కిలోల వరకు వస్తున్నాయి’ అని మీరా సమాధానం ఇచ్చింది.

‘అంటే మీకు గ్యాస్ కనెక్షన్, ఇల్లు లభించింది. కరెంట్ వచ్చింది. బియ్యం వస్తున్నాయి. వావ్’ అని ప్రధాని మోడీ అన్నారు. 

‘మీరు మాకు దేవుడు’ అని మరో మహిళ అనగా.. ‘అలా అనొద్దు. దేవుడంటే భగవాన్ రాముడే’ అని ప్రధాని అన్నారు. ‘మాకు మీరే దేవుడు’ అని ఆ మహిళ తెలిపింది.

‘ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు వచ్చింది?’ అని ప్రధాని ప్రశ్నించారు.

‘రూ. 2.50 లక్షలు వచ్చాయి’ అని మీరా సమాధానం చెప్పింది. ‘అవి నేరుగా మా ఖాతాలోకి వచ్చాయి. ఎవరికీ లంచం ఇవ్వలేదు’ అని తెలిపింది.

ఇక చివరిగా.. ‘చాయ్ మంచిగా చేశారు. నేను చాయ్‌వాలానే. నాకు తెలుసు చాయ్ ఎలా తయారవుతుందో.. ’ అంటూ నవ్వుతూ ప్రధాని మాట్లాడారు. ఆ తర్వాత ఆ కుటుంబం ప్రధాని మోడీతో గ్రూప్ ఫొటో దిగింది. అనంతరం, వారికి ప్రధాని ధన్యవాదాలు చెప్పి బయల్దేరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios