Asianet News TeluguAsianet News Telugu

ఉజ్జయిని అత్యాచారం : ఆటో డ్రైవర్ అరెస్ట్, మరో ముగ్గురు అదుపులోకి.. సహాయం కోసం 8 కి.మీ నడిచిన బాధితురాలు..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మైనర్‌పై అత్యాచారం కేసులో ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Ujjain rape: Auto driver arrested, three others detained.. Victim walked 8 km for help - bsb
Author
First Published Sep 28, 2023, 3:26 PM IST

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కలకలం రేపిన 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, అర్థనగ్నంగా రక్తమోడుతూ వీధుల్లో బాలిక తిరగడం ఘటనలో ఒక ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు సహాయం కోసం వేడుకుంటూ కాలినడకన 8 కిలోమీటర్లు నడిచినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వివరాల ప్రకారం అరెస్టయిన ఆటో డ్రైవర్ రాకేష్ (38)గా గుర్తించారు. మైనర్ బాలిక సహాయం కోరుతూ కాలినడకన వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఘటన గురించి పోలీసులు విచారణలో తేలిన వివరాలను తెలుపుతూ.. , బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఆటో ఎక్కింది.దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా లభించిందని పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్‌లో ఉండి ఆర్డర్.. కారు వద్దకే తీసుకొచ్చి పిజ్జా డెలివరీ.. వావ్ అంటున్న నెటిజన్లు.. (వీడియో)

బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు ఉండడంతో ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సత్నా, పోలీస్ సూపరింటెండెంట్ సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన వెలుగులోకి రావడానికి ఒక రోజు ముందు మైనర్ బాలిక తప్పిపోయినట్లు ఫిర్యాదు నమోదయ్యింది. 

బాలిక వేర్వేరు ప్రదేశాలలో ఐదుగురిని కలుసుకుంది, అందరినీ విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన మరో ముగ్గురిలో ఒకరు ఆటో డ్రైవర్ కూడా. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి వివరాలు వెల్లడి కాలేదు.

ఉజ్జయిని నగరంలోని ఓ వీధిలో అత్యాచారానికి గురై రక్తస్రావంతో ఉన్న 12 ఏళ్ల బాలిక గురించి ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. బుధవారం ప్రత్యేక వైద్యుల బృందం ఆ బాలికకు శస్త్రచికిత్స చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని తెలిపారు.

రక్తం కారుతున్న బాలిక వీధిలో వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించి మహకాల్ పోలీస్ స్టేషన్‌లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదైంది. సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో ఎంపీ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, షాకింగ్ నేరంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios