ట్రాఫిక్‌లో ఉండి ఆర్డర్.. కారు వద్దకే తీసుకొచ్చి పిజ్జా డెలివరీ.. వావ్ అంటున్న నెటిజన్లు.. (వీడియో)
సాధారణంగా ట్రాఫిక్ జామ్ కారణంగా పిజ్జా డెలవరీ ఆలస్యం అవుతుంటుంది. అయితే తాజాగా ఒకచోట ట్రాఫిక్‌లో చిక్కుకున్నవారు ఆర్డర్ చేసిన పిజ్జాను ఇద్దరు డొమినో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు.. ట్రాఫిక్‌ను చేధించుకుని సకాలంలో వారి ఉన్నచోటకే తీసుకొచ్చి ఇచ్చారు.

సాధారణంగా ట్రాఫిక్ జామ్ కారణంగా పిజ్జా డెలవరీ ఆలస్యం అవుతుంటుంది. అయితే తాజాగా ట్రాఫిక్‌లో ఒకచోట చిక్కుకున్నవారు ఆర్డర్ చేసిన పిజ్జాను ఇద్దరు డొమినో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు.. ట్రాఫిక్‌ను చేధించుకుని సకాలంలో వారి ఉన్నచోటకే తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పిజ్జా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు ఆ వీడియోకు ఎక్స్‌లో(ట్విట్టర్) 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వివరాలు.. రిషివత్స్ అనే ఎక్స్ వినియోగదారుడు బెంగళూరులో కారులో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అయితే అదే సమయంలో ఆకలిగా ఉండటంతో డొమినోస్‌లో పిజ్జా ఆర్డర్ చేశారు. అయితే వారు ట్రాఫిక్‌లో ఉన్నప్పటికీ.. డొమినోస్ ఏజెంట్స్ బైక్‌పై వారు ఉన్నచోటుకు వచ్చి పిజ్జాను డెలివరీ చేశారు. లైవ్ లోకేష్‌ను ట్రేస్ చేసి.. ట్రాఫిక్‌లో వారు కొంతదూరం ముందుకు కదిలినప్పటికీ సరిగ్గా వారు ఉన్నచోటుకు చేరుకున్నారు.
డొమినోస్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ వారి వద్దకు సమీపిస్తున్న సమయంలో పిజ్జా ఆర్డర్ చేసిన వ్యక్తి.. ఆ దృశ్యాలను చిత్రీకరించారు. అయితే ఆ సమయంలో ఒక మహిళ.. వాళ్లను జీనియస్ అంటూ అనడం కూడా వినిపిస్తుంది.
‘‘మేము బెంగుళూరు ట్రాఫిక్‌లో ఉన్న సమయంలో డోమినోస్ నుంచి ఆర్డర్ చేయాలని నిర్ణయించుకున్నాం. వారు మా లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేసి.. ట్రాఫిక్ జామ్‌లో మాకు డెలివరీ చేశారు. #Bengaluru #bengalurutraffic #bangaloretraffic" అని రిషివత్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు.. డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ను అభినందిస్తున్నారు. ‘‘డొమినోస్ వారి 30-నిమిషాల డెలివరీ వాగ్దానాన్ని నెరవేరుస్తోంది. ఇది అద్భుతంగా ఉంది’’ అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.