ఉడిపి శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థస్వామి అనుమానాస్పద మృతి కేసు విచారిస్తున్న పోలీసులకు మఠం పక్కలోని స్వర్ణ నదిలో డీవీఆర్ బాక్స్ దొరికింది. స్వామి ధరించిన బంగారు ఆభరణాలను మాయమైనట్టుగా పోలీసులు గుర్తించారు.  

బెంగుళూరు: ఉడిపి శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థస్వామి అనుమానాస్పద మృతి కేసు విచారిస్తున్న పోలీసులకు మఠం పక్కలోని స్వర్ణ నదిలో డీవీఆర్ బాక్స్ దొరికింది. స్వామి ధరించిన బంగారు ఆభరణాలను మాయమైనట్టుగా పోలీసులు గుర్తించారు.

స్వామి నిత్యం వేసుకొనే బంగారు ఆభరణాలు తులసీమాల కన్పించడం లేదు. స్వామికి చెందిన మూడు బంగారు కడియాల్లో ఒక కడియాన్ని స్వామి భక్తురాలు రమ్యాశెట్టి ధరించేవారని సమాచారం. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇతర బంగారు ఆభరణాలు కూడ రమ్యాశెట్టి వద్ద ఉంటాయా.. ఇంకా ఎవరి వద్ద ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

స్వామి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమయంలో బంగారు ఆభరణాలు గల్లంతయ్యాయనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. స్వామి వద్ద మూడు కిలోల బంగారం ఉంటే కిలో బంగారాన్ని ఆయన ప్రతిరోజూ ధరించేవారని చెప్పారు. రమ్యాశెట్టి మాత్రమే స్వామి వారి గదిలోకి వెళ్లేవారని పోలీసులు గుర్తించారు.

మంగళవారం సాయంత్రం రమ్యాశెట్టిని పోలీసులు విచారిస్తున్నారు. ఆమె ఉపయోగించిన ఫోన్ నెంబర్లను కూడ పోలీసులు సేకరించి విచారిస్తున్నారు. మఠంలో దొరికిన మూటలో విదేశీ మద్యం, కండోమ్స్ లభించాయి. స్వామి నిద్రించే గదిలో కొన్ని ఔషధాలు లభ్యమయ్యాయి. రమ్యాశెట్టితో సన్నిహితంగా ఉండే ఆటోడ్రైవర్‌ను కూడ పోలీసులు విచారిస్తున్నారు. డీవీఆర్‌ మఠం పక్కనే ఉన్న స్వర్ణ నదిలో డీవీఆర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.