Asianet News TeluguAsianet News Telugu

పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగమే అని అంగీకరించిన యూఏఈ.. పాకిస్థాన్ కు సందేశం..

పీవోకే భారత భూభాగంలో అంతర్భాగమే అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ ఉప ప్రధాని సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఓ వీడియో విడుదల చేశారు. జీ20 సమ్మిట్ కు సంబంధించిన ఈ వీడియో  పీవోకే భారత్ దే అని స్పష్టం చేస్తోంది.

UAE has accepted that Pakistan Occupied Kashmir is a part of India.. Message to Pakistan..ISR
Author
First Published Sep 15, 2023, 7:39 AM IST

పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగమే అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అంగీకరించింది. ఇటీవల ఢిల్లీలో ముగిసిన జీ 20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ఓ వీడియోను యూఏఈ ఉపప్రధాని సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో షేర్ చేశారు. అందులో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ను భారత భూభాగంలో అంతర్భాగంగా గుర్తించిన వాణిజ్య కారిడార్ కనిపిస్తోంది. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ లో పీఓకేను కీలక అంశంగా మ్యాప్ లో చూపించారు, ఇది భారతదేశ ప్రాదేశిక సమగ్రతను బలోపేతం చేసే దౌత్య చర్యను సూచిస్తుంది. ఈ వీడియో పీవోకే భారత్ భూభాగమేనని తాము గుర్తించామనే సందేశాన్ని పాకిస్థాన్ కు పరోక్షంగా పంపింది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో ప్రారంభించిన భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారిడార్ భారతదేశం, మధ్యప్రాచ్యం, ఐరోపా మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ వ్యూహాత్మక చొరవలో భాగంగా పీఓకేను ఇప్పుడు గుర్తించారు.

 

పీవోకే భారత భూభాగమే అని పేర్కొంటూ రూపొందించిన వీడియోను యూఏఈ ఉప ప్రధాని షేర్ చేయడం వల్ల.. ఎంతో కాలంగా పీవోకే తమదే అని వాదిస్తున్న పాకిస్థాన్ కు చెంపపెట్టులాంటిది. పీఓకేను భారత్ లో అంతర్భాగమే అని ప్రపంచం గుర్తించిందనే విషయాన్ని ఈ వీడియో పునరుద్ఘాటించింది.

భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ వివిధ రంగాల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సహకారాన్ని పెంపొందిస్తుందని, ఈ ప్రాంతాల మధ్య బలమైన సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని హామీ ఇచ్చింది. ఈ కారిడార్ ఊపందుకోవడంతో ఆర్థిక వృద్ధికి, అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని, భాగస్వామ్య దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios