హెల్మెట్ ఎక్కడుంది? పోలీసులను బైక్ పై వెంటాడిన ఇద్దరు మహిళలు.. వీడియో వైరల్
ఇద్దరు మహిళలు పోలీసులనే బైక్ పై ఛేజ్ చేసి హెల్మెట్ ఎక్కడుందని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. వారికి రూ. 1000 జరిమానా పడింది.
లక్నో: ద్విచక్ర వాహనంపై వెళ్లుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం మన దేశంలో తప్పనిసరి. అది ట్రాఫిక్ రూల్. ఒక వేళ హెల్మెట్ ధరించకుంటే ఫైన్లు పడతాయి. ఈ నిబంధనల ఉల్లంఘనులపై పోలీసు అధికారులు ఎప్పుడూ నిఘా వేసి పెడుతుంటారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించగానే వారికి చాలాన్లు వేస్తుంటారు. ఇదంతా సర్వసాధారణంగా మనం చూసేదే. కానీ, ఇద్దరు మహిళలు పోలీసులను బైక్ పై వెంటాడి మరీ ‘మీ హెల్మెట్ ఎక్కడా?’ అంటూ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఆ వీడియో ప్రకారం, ఇద్దరు పోలీసులు బైక్ పై వేగంగా వెళ్లుతున్నారు. వారిద్దరిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు. వీరిని ఇద్దరు మహిళలు బైక్ పై ఛేజ్ చేశారు. హెల్మెట్ ఎక్కడ ఉన్నది అంటూ వారు వెంటపడి మరీ ప్రశ్నించారు. దీంతో వెనుక వైపు కూర్చున్న అధికారి వారిని చూసీ చూడనట్టుగా చూశాడు. వెంటనే ఆ బైక్ మరింత వేగంగా వెళ్లిపోయింది. ఆ పోలీసులను మహిళలు అడ్డుకోలేకపోయారు. కానీ, వారి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: ప్రధాని మోడీని కలిసిన యాపిల్ సీఈవో టిమ్ కుక్.. భారత్ లో పెట్టుబడులపై చర్చ
మీ హెల్మెట్ ఎక్కడ ఉన్నది? రూల్స్ అన్నీ ప్రజలకేనా? మీకు రూల్స్ వర్తించవా? అని ఆ వీడియోలో మహిళ అంటున్నట్టు వినిపిస్తున్నది.
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత గజియాబాద్ ట్రాఫిక్ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఆ బైక్ నంబర్ ప్లేట్‌ను ఆధారం చేసుకుని పోలీసులు ఆ పోలీసు అధికారులకు రూ. 1000 జరిమానా విధించారు.