ఆ మహిళ... ఆ చిలుకను మహిళకు ఇవ్వడానికి నిరాకరించింది.  దాంతో... వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  చిలుక నాదంటే నాది అంటూ గొడవ పడ్డారు. 

ఒక చిలుక కోసం ఇద్దరు యువతులు గొడవ పడ్డారు. నాదంటే నాది అంటూ అని గొడవ పడ్డారు. చివరకు పోలీసులను కూడా ఆశ్రయించారు. వారు కూడా... వారి సమస్యను పరిష్కరించలేకపోయారు. అయితే.... చివరకు ఆ చిలుకే వారి సమస్యను పరిష్కరించడం గమనార్హం. స్వయంగా చిలుకే.. వారిద్దరిలో.. తన యజమాని ఎవరో కనిపెట్టడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉత్తరప్రదేశ్ లోని బడీవార్ గ్రామానికి చెందిన బూటీ అనే యువతి... అదే గ్రామాని చెందిన మహిళ వద్దకు వెళ్లింది. అక్కడ ఉన్న తన చిలుకను చూసి.. అది తనదేనని తనకు తన చిలుక ఇవ్వాలని కోరింది. అయితే... ఆ మహిళ... ఆ చిలుకను మహిళకు ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో... వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చిలుక నాదంటే నాది అంటూ గొడవ పడ్డారు. చివరకు వీరి గొడవ పోలీస్ స్టేషన్ కి చేరింది. వారు కూడా నిజంగా ఆ చిలుక ఎవరితో తేల్చలేకపోయారు. ఎందుకంటే.. ఇద్దరూ ఆ చిలుక తమదే అని వాదించడం గమనార్హం.

తన చిలుక రెండేళ్లుగా తప్పిపోయిందని బూటీ వాదించగా... ఐదేళ్లుగా తాను ఈ చిలుకను పెంచుకుంటున్నానని మరో యువతి చెప్పడం గమనార్హం. కాగా... అయితే.... బూటీ.. తన చిలుక తన పేరు చెప్పగలదంటూ చెప్పింది. అయితే... నిజంగా చిలుక ఆమె పేరు చెబితే.. ఆమెకు ఇచ్చేస్తామని పోలీసులు చెప్పారు. చిలుక కూడా బూటీ అని పిలవడంతో సమస్య పరిష్కారం అయ్యింది. బూటీకి చిలుకను ఇచ్చి పంపించారు.