సెల్ఫీ మోజు: జలపాతంలో పడి ఇద్దరు టెక్కీల మృతి

Two Techies Die After Falling Into Waterfall While Clicking Selfie
Highlights

సెల్ఫీ మోజు ఇద్దరు టెక్కీల ప్రాణాలను బలి తీసుకుంది. సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు జలపాతంలో పడి మరణించాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆదివారనాడు చోటు చేసుకుంది.

బెంగళూరు: సెల్ఫీ మోజు ఇద్దరు టెక్కీల ప్రాణాలను బలి తీసుకుంది. సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు జలపాతంలో పడి మరణించాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆదివారనాడు చోటు చేసుకుంది. 

కనకపుర జిల్లా మేమెదాతు జలపాతంలో పడి వారు కొట్టుకుపోయారు. ఈ ప్రాంతంలో కావేరీలో ఉప నది అర్కవతి ఉంది. దాదాపు 20 ఏళ్ల వయస్సు ఉన్న షమీర్ రహ్మాన్, భవానీ శంకర్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. 

సెల్ఫీ తీసుకుంటూ రహ్మాన్ జలపాతంలోకి జారాడు. అతన్ని రక్షించే ప్రయత్నంలో భవానీ శంకర్ కూడా పడిపోయాడు. కర్ణాటకలోని కృష్ణ రాజ సాగర్ డ్యామ్ నుంచి మిగులు జలాలను వదిలారు. దీంతో అక్కడ రెండు నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 

నీటి ప్రవాహాల వద్దకు, జలాశయాలకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజలు వినడం లేదు

loader