భోపాల్: మహారాష్ట్రలో భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడ అదే తరహా ఘటన మరోటి చోటు చేసుకొంది. రెండంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ  ప్రమాదంలో పలువురు భవనాల శిథిలాల కింద చిక్కుకొన్నారు. 

రాష్ట్రంలోని దేవాస్ ప్రాంతంలోని లాల్ గేట్ వద్ద రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకొన్న వారిలో ఆరుగురిని రక్షించారు.భవన శిథిలాల కింద చిక్కుకొన్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

శిథిలాల నుండి బయటకు తీసిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ఈ భవనం కుప్పకూలడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. అధికారులు, పోలీసులు, స్థానికులు శిథిలాల్లో చిక్కుకొన్నవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 

also read:మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం: సురక్షితంగా బయటపడ్డ ఐదేళ్ల బాలుడు

ఇప్పటికే మహారాష్ట్రలోని రాయ్ ఘడ్ జిల్లాలో  ఐదంతస్థుల భవనం సోమవారం నాడు కుప్పకూలిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో ఇప్పటికే 11 మంది మరణించారు. 60 మందిని రక్షించారు.