Asianet News TeluguAsianet News Telugu

పోలీసులకు కరోనా: రెండు పోలీస్ స్టేషన్లకు లాక్.. 105 మంది సిబ్బంది క్వారంటైన్‌లోకి

కోయంబత్తూరు నగరానికి సమీపంలో ఉన్న పొదనూర్, కునియాముత్తూర్ పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బందికి కరోనా  సోకడంతో ఉన్నతాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా రెండు స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. 

Two police stations in tamilnadu closed after six personnel test COVID 19
Author
Coimbatore, First Published Apr 26, 2020, 8:20 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. కోవిడ్ 19 బారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, మెడికల్ సిబ్బందితో సమానంగా శ్రమిస్తున్నారు పోలీస్ సిబ్బంది. అయితే దురదృష్టవశాత్తూ ఈ మహమ్మారికి వారికి కూడా సోకడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా తమిళనాడులో ఆరుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌గా  తేలింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు నగరానికి సమీపంలో ఉన్న పొదనూర్, కునియాముత్తూర్ పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బందికి కరోనా  సోకడంతో ఉన్నతాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా రెండు స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.

Also Read:రేపు సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్.. లాక్‌డౌన్ ఎత్తేస్తారా, పొడిగిస్తారా: దేశ ప్రజల ఆసక్తి

వీరితో పాటు విధులు నిర్వర్తించిన 105 మంది పోలీస్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్ వచ్చిందని నగర పోలీస్ కమీషనర్ ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన పోలీసులకు కోయంబత్తూరులోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కాగా తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. శనివారం రాష్ట్రంలో 66 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1,821కి చేరింది. వీరిలో దాదాపు 900 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read:నూతన వధూవరులకు కరోనా: గ్రామంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు

తమిళనాడులో వైరస్ కారణంగా మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ముంబైలో వైరస్ సోకి ఓ పోలీస్ కానిస్టేబుల్ మరణించినట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96 మంది పోలీసులు కోవిడ్ 19 బారినపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios