Asianet News TeluguAsianet News Telugu

సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ లోకి అక్రమ చొరబాటు.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (bollywood star hero salman khan) ఫాం హౌస్ (farm house)లోకి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించేందుకు (Security breach) ప్రయత్నించారు. అయితే దీనిని అక్కడున్న సిబ్బంది గుర్తించారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Two people arrested for trying to break into Salman Khan's farmhouse..ISR
Author
First Published Jan 8, 2024, 4:27 PM IST

ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి ఇద్దరు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలోని పన్వేల్ లో సల్మాన్ ఖాన్ కు అర్పితా ఫాం హౌస్ ఉంది. అందులోకి జనవరి 4వ తేదీన చొరబడేందుకు ఇద్దరు ప్రయత్నించారు.

బాబ్రీ మసీదుపైనే రామాలయం.. ప్రారంభోత్సవాన్ని ముస్లింలు వ్యతిరేకించాలి - ఖలిస్తానీ నేత సంచలన వ్యాఖ్యలు..

దీనిని గుర్తించిన అక్కడి సిబ్బంది వారిని పట్టుకున్నారు. అనంతరం వారి పేర్లు, చిరునామాలు వెల్లడించారు. అయితే అవన్నీ నకిలీవని తేలింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారిద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'టైగర్ 3' విజయంతో జోరుమీదున్నాడు. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.466.63 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఈ సినిమాలో సల్మాన్ కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఇటీవల జరిగిన బిగ్ బాస్ 17 ఎపిసోడ్ తరువాత ఆయన చేసిన ఓ ప్రకటన సల్మాన్ ఖాన్ ను వార్తల్లో నిలిచారు. ఫైనల్ ఎపిసోడ్ ముగిసిన తరువాత అభిమానులు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన నిర్వాహకులను కోరారు.

వెంటనే మసీదులు ఖాళీ చేయండి.. లేకపోతే - బీజేపీ నేత ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు..

ఈ ఎపిసోడ్ ముగిసిన అనంతరం సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ..  చాలా మంది 'బిగ్ బాస్' అభిమానులు హౌస్ లోకి ప్రవేశించాలని కోరుకుంటున్నారని తాను విన్నానని చెప్పారు. తఅలాంటప్పుడు వారికి కూడా విలాసవంతమైన ఇంట్లో నివసించే అవకాశం ఎందుకు ఇవ్వకూడదని తనకు అనిపిస్తుందని చెప్పారు. ఫైనల్ తరువాత కంటెస్టెంట్స్ హౌస్ ఖాళీ అవుతుందని, తరువాత అది జరగవచ్చని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో ఆయన వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios