క్యాబ్ లో ఎక్కిన ఓ ఇద్దరు వ్యక్తులు.. నిర్జనప్రదేశంలో డ్రైవర్ ను దోచుకుని, కారుతో పరారయ్యారు. ఈ ఘటన నోయిడాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. 

నోయిడా : నోయిడా నుండి మథురకు క్యాబ్‌ బుక్ చేసుకుని, తిరిగి వస్తుండగా యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో క్యాబ్ డ్రైవర్‌ను దోచుకుని వాహనంతో పారిపోయిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

వారినుంచి హ్యుందాయ్ ఆరా, డ్రైవర్ స్మార్ట్ వాచ్, దోచుకున్న నగదులో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నామని, రెండు రోజుల్లో కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను తరుణ్ సింగ్ (25), చంద్ర ప్రకాష్ సింగ్‌ (33)లుగా గుర్తించామని, ఇద్దరూ ఘజియాబాద్‌కు ఆనుకుని ఉన్న విజయనగర్ ప్రాంతంలో నివసిస్తున్నారని పోలీసు ప్రతినిధి తెలిపారు.

మిరాకిల్ : కరెంట్ షాక్ తో కాళ్లు, చేతులు కోల్పోయిన కోతి.. కాపాడి, 41రోజుల వైద్యంతో ప్రాణం పోసిన వైద్యులు..

వీరిద్దరూ ఇంతకు ముందు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేశారు. కానీ కొంతకాలం క్రితం ఉద్యోగాలు కోల్పోయారు. డబ్బు అవసరమని, వారు క్యాబ్ ను, దాని డ్రైవర్‌ను దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం వారు నోయిడా నుండి మధురకు ఇంటర్-సిటీ ట్రిప్‌ని ఆగస్టు 13న బుక్ చేసుకున్నారని అధికారి తెలిపారు.

"నిందితులు బిస్రఖ్ ప్రాంతంలోని ఇతెహ్దా గోల్ చక్కర్ నుండి క్యాబ్‌ను బుక్ చేశారు. ఘజియాబాద్-రిజిస్టర్డ్ క్యాబ్ డ్రైవర్‌కు ఇద్దరూ మధుర వెళ్ళాలని చెప్పారు. అక్కడికి వెళ్లాక.. మళ్లీ తిరిగి నోయిడాకు వెళ్ళాలని చెప్పారు. అక్కడికి వెళ్లాక ఛార్జీలు చెల్లించడానికి అంగీకరించారు" అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే, ఆగస్ట్ 13న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మథుర నుంచి నోయిడాకు తిరిగి వస్తుండగా టాయిలెట్‌ బ్రేక్‌ అంటూ నిర్జన ప్రదేశంలో క్యాబ్‌ను ఆపాలని డ్రైవర్‌ను కోరారు. డ్రైవర్ కారు ఆపగానే వెంటనే ఓ పిస్టల్‌, కత్తులతో డ్రైవర్‌పై దాడి చేశారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పారి చౌక్ సమీపంలో.. డ్రైవర్ ను వదిలేసి కారుతో పారిపోయారు. అంతకుముందు డ్రైవర్ దగ్గరున్న రెండు మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్, మరికొన్ని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు" అని పోలీసులు తెలిపారు.

గొడవ సమయంలో వారిద్దరూ క్యాబ్ డ్రైవర్‌ను అతని మొబైల్ ఫోన్ ద్వారా రూ. 14,000 కంటే ఎక్కువ డబ్బులను తన సహచరుడికి పంపాలని చేయమని బలవంతం చేశారు. ఆ నగదు బదిలీ అయిన వ్యక్తిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. సోమవారం, డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 392 (దోపిడీ) కింద బిస్రఖ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. దీనిమీద దర్యాప్తు మొదలుపెట్టారు. 

"ఈ రోజు, స్థానిక పోలీసుల సమాచారం ఆధారంగా, మాన్యువల్ ఇంటెలిజెన్స్ ద్వారా, వారిని చిపియానా గ్రామం, బిస్రఖ్‌లోని ఏక్ మూర్తి మధ్య రహదారి నుండి అరెస్టు చేశారు. విచారణలో, నిందితులు తమ సహచరులలో ఒకరితో క్యాబ్ దోపిడీకి ప్లాన్ చేసినట్లు చెప్పారు" అని పోలీసులు చెప్పారు.

"పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రైవర్ ఈ మూడవ సహచరుడి ఖాతాకే ఆన్‌లైన్‌లో రూ. 14,239 ట్రాన్స్ ఫర్ చేసాడు, అందులో రూ. 2,500 రికవరీ అయ్యింది. మిగిలినది నిందితులు ఖర్చు చేశారు" అని పోలీసులు తెలిపారు. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులిద్దరూ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేశారు. అయితే ఇద్దరూ ఉద్యోగాలు కోల్పోయారు. ఆ ప్రాంతంలోని దారులపై వారికి సరైన అవగాహన కూడా ఉంది.

"డబ్బులు సంపాదించడం కోసం వారు ఈ దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ రోజు పట్టుబడినప్పుడు కూడా ఇలాంటి మరో దోపిడీకి వారు ప్లాన్ చేస్తున్నారు" అని ఒక అధికారి పేర్కొన్నారు.