కేరళలోని ఎరుమపెట్టిలో ఓ కోతి 11కేవీ కరెంట్ లైన్‌పై నుంచి దాటుతుండగా కరెంట్ షాక్ కొట్టి తీవ్రంగా గాయపడింది. త్రిసూర్‌లోని మచాద్ వెటర్నరీ క్లినిక్‌లో 41 రోజుల చికిత్స తర్వాత కోతి తిరిగి కోలుకుంది.
కేరళ : కేరళ ఎరుమపెట్టిలో ఓ అద్బుతమైన ఘటన చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో 41 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఓ కోతి చివరికి కోలుకుంది. 11కేవీ లైన్‌పై నుంచి వెడుతుండగా ఓ కోతి విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే దాన్ని అటవీశాఖ అధికారులు మచాడ్ వెటర్నరీ క్లినిక్ కు తరలించారు. అక్కడ ఆ కోతికి 41 రోజుల పాటు తీవ్ర చికిత్స అందించారు. అలా దాన్ని అటవీశాఖ అధికారులు రక్షించగలిగారు.
మచాడ్ వెటర్నరీ క్లినిక్‌లో అటవీశాఖ వెటర్నరీ అధికారి డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలోని బృందం కోతికి వైద్యం అందించింది. కోలుకున్న తర్వాత కోతిని అడవిలోకి వదిలారు. ఎరుమపెట్టిలో జూలై 6న కోతి కరెంట్ షాక్ కు గురైంది. కరెంటు షాక్‌తో దాని చేయి, కాలు తెగిపోయాయి. 41 రోజుల పాటు చికిత్స పొందిన తరువాత కోతి పూర్తిగా కోలుకుంది.
రాజస్తాన్‌లో కూడా మోదీ మ్యాజిక్.. కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?.. తాజా సర్వే ఏం చెబుతుందంటే..
పశువైద్యుడు డాక్టర్ అశోక్ మాట్లాడుతూ, మొదట కోతిని చూసినప్పుడు, అది బతుకుతుందన్న ఆశ లేదని అన్నారు. మత్తుమందు ఇచ్చి పరీక్షించగా కోతి తలకు బలమైన గాయం అయినట్లు తెలిసింది. కోతి కళ్ళు కూడా తెరవలేకపోయింది. దీంతో మొదటి దశ చికిత్సలలో హోమియోపతి మందులు ఇస్తూ.. కంటి చికిత్సలు కూడా చేశాం.
చివరకు ఒక వారం తర్వాత కోతి నెమ్మదగా తినడం ప్రారంభించింది. తినడం మొదలుపెట్టాక దానిని వేరే బోనులోకి తరలించారు. అనంతరం వివిధ రకాల చికిత్సలు నిర్వహించారు. కోతి ఆరోగ్యం కోలుకున్న తర్వాత ఇటీవలే అడవిలోకి విడిచిపెట్టారు. ఇతర కోతులు కోతిని సమూహంలో చేరనివ్వకపోతే, దానిని తిరిగి తీసుకురావడం ద్వారా దానిని రక్షించడమే లక్ష్యం అని డాక్టర్ తెలిపారు. శరీరమంతా గాయాలతో ఉన్న కోతి పూర్తిగా కోలుకోవడంతో అటవీశాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
