Asianet News TeluguAsianet News Telugu

ఇండిగో విమానంలో బీర్లు తాగిన ఇద్దరు ప్రయాణికులు.. అరెస్టు చేసిన పోలీసులు

ఢిల్లీ నుంచి పాట్నాకు బయల్దేరిన ఇండిగో విమానంలో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించారు. కొందరు ప్రయాణికులు క్రూతో చెప్పడంతో వారు జోక్యం చేసుకున్నారు. మద్యం సేవించిన విషయాన్ని వారు అంగీకరించి క్షమాపణలు కోరారు.
 

two passengers arrested after drinking beers in indigo flight which travelled from delhi to bihar
Author
First Published Jan 9, 2023, 2:55 PM IST

పాట్నా: ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్లుతున్న ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికులు మద్యం సేవించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సహకారంతో పాట్నా ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. డొమెస్టిక్ ఫ్లైట్‌లో ఆల్కహాల్ తాగిన ఇద్దరు ప్రయాణికులను ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్టు అధికారులు వివరించారు. అయితే, ఆన్‌బోర్డులో ఎలాంటి గలాట జరగలేదని కొన్ని వర్గాలు తెలిపాయి. సిబ్బంది జోక్యం చేసుకోవడంతో వారు ఆల్కహాల్ తాగడం ఆపేసి క్షమాపణలు కూడా చెప్పినట్టు పేర్కొన్నాయి.

ప్రోటోకాల్ ప్రకారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు ఈ ఘటన గురించి ఎయిర్‌లైన్ ఇన్ఫామ్ చేసింది. వారు ఫ్లైట్ దిగగానే పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి బయల్దేరిన ఫ్లైట్‌లో ఇద్దరు ప్రయాణికులు మద్యం సేవించారు. 80 నిమిషాల ప్రయాణంలో వారు తాగడానికే ప్రయత్నించారు. వారిద్దరు ఫ్లైట్ నుంచి దిగగానే సీఐఎస్ఎఫ్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు పోలీసులకు అందించారు.

ఈ విషయంపై ఇండిగో కూడా ట్వీట్ చేసి వివరణ ఇచ్చింది.

Also Read: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుల ఇక్కట్లు.. మూడున్నర గంటల ముందే రావాలంటున్న ఇండిగో..!

ఢిల్లీ నుంచి పాట్నాకు బయల్దేరిన 6ఈ 6383 విమానం ఆన్‌బోర్డుపై ఈ ఘటన జరిగిందని, ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వివరించింది. అయితే, విమానంలో మాత్రం ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోలేదని తెలిపింది. కొన్ని మీడియా వర్గాల్లో ఇందుకు భిన్నమైన చర్చ జరుగుతున్నదని పేర్కొంది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీ జీ సీ ఏ) వర్గాల ప్రకారం, ఫ్లైట్‌ లోపల కొందరు బీర్ తాగుతున్నారని ప్రయాణికులు సిబ్బందికి తెలిపారు. వారు మొత్తం ఆరుగురు ఉన్నారు. ఫ్లైట్‌లోని క్రూ మద్యం తాగుతున్నవారి తో జోక్యం చేసుకున్నాక, వారి సీటు ప్యాకెట్లలో ఎంప్టీ క్యాన్‌లు చూసిన విషయాన్ని పైలట్‌కు తెలియజేశారు. ఇద్దరు ప్రయాణికులు వారు మద్యం సేవించినట్టు అంగీకరించారు. వారిని వారికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు సెక్యూరిటీకి అప్పగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios