Asianet News TeluguAsianet News Telugu

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఆఫర్ చేశాయి.. వద్దన్నా.. సోనూసూద్ వెల్లడించిన సంచలన విషయాలివే..

యాక్టర్, యాక్టివిస్ట్ సోనూ సూద్‌కు రెండు పార్టీ రాజ్యసభ సీటును ఆఫర్ చేశాయని, కానీ, తాను వాటిని తిరస్కరించినట్టు వివరించారు. రాజకీయాల్లోకి చేరడానికి తాను మానసికంగా సిద్ధంగా లేరని చెప్పారు. అందుకే వాటిని సున్నితంగా తిరస్కరించారని పేర్కొన్నారు. అలాగే, ఇటీవలే జరిగిన ఐటీ తనిఖీలపైనా స్పందించారు. 18 కోట్లు ఇంకా అకౌంట్‌లో ఊరికే పడిఉన్నాయన్న ఆరోపణలను ప్రస్తావించా వాటిని పంపిణీ చేయడానికి 18 గంటలు కూడా పట్టదని అన్నారు. కానీ, అవసరార్థులకే ప్రతి రూపాయి చేరాలన్నదే తన ఆశయమని వివరించారు.
 

two parties offered rajyasabha seats to actor sonu sood but rejected
Author
New Delhi, First Published Sep 20, 2021, 4:17 PM IST

న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఆపన్నహస్తంగా అందరికి అందుబాటులోకి వచ్చిన యాక్టర్, యాక్టివిస్ట్ సోనూసూద్ సంచలన విషయాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సోనూసూద్ ఒక ఆపద్భాందవుడిగా మారడంతో కొన్ని రాజకీయ పార్టీలు ఆయన పాపులారిటీని క్యాచ్ చేసుకోవాలనుకున్నాయి. కానీ, పాలిటిక్స్‌పై ఇంటరెస్ట్ లేని సోనూసూద్ వాటిని సున్నితంగా తిరస్కరించారు. సోనూ సూద్ నివాసం, ఆయన నివాసాల్లో మూడు రోజులపాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత తాజాగా ఆయన ఓ మీడియాతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.

పన్ను ఎగ్గొట్టినట్టు తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను చట్టానికి బద్దుడై ఉన్న పౌరుడినని ఆయన స్పష్టం చేసుకున్నారు. అంతేకాదు, తనకు రెండు పార్టీల నుంచి రాజ్యసభ సీటు కోసం ఆఫర్ వచ్చిందని తెలిపారు. కానీ, రాజకీయాల్లోకి రావడానికి తాను మానసికంగా సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. అందుకే వాటిని తిరస్కరించారని వివరించారు.

‘ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలన్నింటినీ వారికి అందించాం. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చాను. నా బాధ్యత నేను నిర్వర్తిస్తే.. వారి జాబ్ వారు చేశారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చా.. అడిగిన ప్రతి డాక్యుమెంట్ చూపించాను. అది నా బాధ్యత. ఇప్పటికీ ఇంకా డాక్యుమెంట్లు అందిస్తూనే ఉన్నా’ అని సోనూసూద్ వివరించారు. 

విదేశాల నుంచి  వచ్చిన ప్రతి పైసాకూ లెక్క ఉన్నదని చెప్పారు. తాను చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. విరాళాలుగా వచ్చిన 18 కోట్లు అలాగే ఖాతాలో నిల్వ ఉన్నాయని ఆరోపణలు వచ్చాయని అడగ్గా.. ‘ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నేను సేకరించినవాటిలో అన్ని పౌరుల నుంచే రాలేదు. కొన్ని బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్నందను రెమ్యునరేషన్ కింద కూడా వచ్చాయి. నేనే వారిని ప్రాణాలు రక్షించే సహాయ కార్యక్రమంలో పాల్గొనాలని అడిగాను’ అని తెలిపారు. ‘నాకు 54వేల చదవని మెయిల్స్ ఉన్నాయి. వేలాది మెస్సేజ్‌లు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ఉన్నాయి. ఇప్పటికీ ఆ 18 కోట్లు ఖర్చు చేయాని 18 గంటలు కూడా పట్టవు. కానీ, నేను ఇచ్చే ప్రతి పైసా అవసరార్థులకే చేరాలనేది నా సంకల్పం’ అని వివరించారు. మరొక విషయం ఆ డబ్బు ఏళ్ల తరబడి ఖాతాలో లేదని, ఈ మూడు నాలుగు నెలల నుంచే ఉన్నాయని పేర్కొన్నారు.

విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయని చెబుతున్న వాటి గురించి ప్రస్తావించగా, ‘నా అకౌంట్‌లో ఒక్క డార్ల కూడా పడలేదు’ అని వివరించారు. వాటిని డైరెక్ట్‌గా లబ్దిదారులకే బదిలీ చేయించానని అన్నారు.

తన డాక్యుమెంటేషన్ చూసి ఐటీ అధికారులు సంతోషించారని, ఎక్కడా విసుగుచెందలేదని సోనూ సూద్ తెలిపారు. ఎక్కడైనా ఇంతటి పేపర్ వర్క్ చూశారా? అని అడగ్గా లేదని వారు సమాధానమిచ్చినట్టూ చెప్పారు. ఆ నాలుగు రోజుల తనిఖీలూ స్మూత్‌గా జరిగాయని చెప్పినట్టూ వివరించారు.

తాను ఆప్‌లో చేరడం లేదని స్పష్టంచేశారు. ఎవరైనా తనను ఏ రాష్ట్రానికి రమ్మన్న వెంటనే అక్కడ వాలిపోతారని చెప్పారు. అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రమైనా తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో తాను ఇది వరకే పనిచేశారని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios