Asianet News TeluguAsianet News Telugu

Omicron: మహారాష్ట్రలో మరో ఇద్దరికి ఒమిక్రాన్.. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 23

మహారాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తి, అమెరికా నుంచి వచ్చిన 36ఏళ్ల వ్యక్తికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. వీరిద్దరూ ఫైజర్ టీకా తీసుకుని ఉన్నారు. వారిలో కరోనా లక్షణాలేమీ లేవు. ప్రస్తుతం ముంబయిలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వీరిద్దరితో మహారాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 10కి పెరిగింది.
 

two more omicron cases detected in maharashtra
Author
Mumbai, First Published Dec 6, 2021, 7:39 PM IST

ముంబయి: ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) వేగంగా వ్యాపిస్తున్నది. తొలుత Karnatakaలో రెండు కేసులు నమోదైన రోజుల వ్యవధిలోనే  గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా వరకు విదేశాలు తిరిగి వచ్చిన వారే ఉన్నారు. తాజాగా, ముంబయిలో మరో ఇద్దరిలో ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రకు వచ్చిన 37ఏళ్ల వ్యక్తికి, అమెరికా నుంచి వచ్చిన 36ఏళ్ల ఆయన ఫ్రెండ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. వారు విదేశాల నుంచి వచ్చినందున శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించగా వారిద్దరిలోనూ ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిద్దరూ ఫైజర్ టీకా వేసుకున్నారు. ఇద్దరిలోనూ కరోనా లక్షణాలేమీ లేవు. వీరిద్దరూ ముంబయిలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు. Mumbaiలో తాజా రెండు కేసులతో దేశం(India) మొత్తంలో ఒమిక్రాన్ Cases సంఖ్య 23కు పెరిగింది.

ఆదివారం మహారాష్ట్రలో ఒకే సారి ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అన్ని కూడా పూణె మెట్రోపాలిటన్ రీజియన్‌లోనే వెలుగు చూశాయి. ఇందులో ఆరు ఒమిక్రాన్ కేసులు పింప్రి చించ్వాడ్‌లో రిపోర్ట్ కాగా, పూణె నుంచి ఒకరిలో ఈ వేరియంట్ పాజిటివ్‌గా తేలింది. పింప్రి చించ్వాడ్‌లోని సోదరుడిని చూడటానికి నైజీరియాలోని లాగోస్ నుంచి ఇద్దరు కూతుళ్లతోపాటు వచ్చిన 44 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెతోపాటు ఆమె ఇద్దరు కూతుళ్లు, ఆమె సోదరుడికి, సోదరుడి ఇద్దరు కుమార్తెలకూ కరోనా పాజిటివ్ వచ్చింది. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ చేయగా.. ఆ ఆరుగురికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. కాగా, అంతకు ముందే ఫిన్లాండ్ నుంచి మహారాష్ట్రలోని పూణెకు వచ్చిన ఓ వ్యక్తిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను అధికారులు గుర్తించారు.

Also Read: Omicron: జనవరి, ఫిబ్రవరిలో చిన్నపాటి థర్డ్ వేవ్.. ఆంక్షలు అవసరమే.. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని (jaipur) ఆదర్ష్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని 9మందికి ఈ రకం వేరియంట్‌ వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చినట్లు తెలిపింది. అంతకుందు మహారాష్ట్రలో (maharashtra) ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ అయ్యింది. నైజీరియా నుంచి వచ్చిన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ రకం వెలుగుచూసింది. అలాగే ఫిన్లాండ్‌ నుంచి పుణె (pune) వచ్చిన మరో వ్యక్తిలోనూ ఒమిక్రాన్ వైరస్‌ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో 9, మహారాష్ట్రలో 8, కర్ణాటకలో 2, ఢిల్లీ, గుజరాత్‌లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజులోనే 17 కేసులు నమోదు కావడం దేశంలో కలకలం రేపుతోంది. కాగా.. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా దక్షిణాఫ్రికాలో నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ వేరియంట్ 40కి పైగా దేశాలకు పాకింది.

Follow Us:
Download App:
  • android
  • ios