జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ రెండు భూకంపాలు సంభవించాయి. మంగళవారం ఆ ప్రాంతంలో వచ్చిన భూకంపంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీని నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ రెండు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. 

జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కత్రా, దోడా ప్రాంతాల్లో వరుసగా 4.3, 2.8 తీవ్రతతో రెండు భూకంపాలు వచ్చాయి. దీంతో ఒక్క సారిగా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కత్రాలో తెల్లవారుజామున 2.20 గంటలకు భూప్రకంపనలు సంభవించాయని, కత్రాకు ఈశాన్యంగా 81 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.

అందుకే రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేశారు - కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్

అలాగే రియాసి జిల్లాలోని కత్రాకు తూర్పున 74 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 2.43 గంటలకు భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. భూకంప కేంద్రం ఐదు కిలోమీటర్ల లోతులో ఉంది. అయితే వీటి వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.

హిజాబ్ ధరించాలని హిందూ విద్యార్థులపై ఒత్తిడి.. స్కూల్ బిల్డింగ్ ను కూల్చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం

దోడా జిల్లాలో 5.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన మరుసటి రోజే ఈ రెండు భూకంపాలు సంభవించాయి. మంగళవారం సంభవించిన భూప్రకంపనలకు జంట పర్వత జిల్లాలైన దోడా, కిష్త్వార్ లలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరు పాఠశాల పిల్లలతో సహా ఐదుగురికి గాయాలు కాగా, ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలను అధికారులు మూసివేశారు. జమ్ముకశ్మీర్ ప్రాంతంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ భూకంపం సంభవించింది.

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.