మహారాష్ట్రలోని ఉల్హాస్ నగర్‌లో దారుణం జరిగింది. పచ్చని పెళ్లిపందరిలో ఓ వ్యక్తి హత్యకు గురికావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. డొంబివ్లిలో నివసిస్తున్న మృతుడు తన సమీప బంధువు రవి మంజులే వివాహ కార్యక్రమానికి కుటుంబంతో కలిసి హాజరయ్యాడు.

ఈ క్రమంలో రవి షిండే నిందితుల్లో ఒకరు తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలుసుకున్న అతను ఇద్దరితో ఘర్షణకు దిగాడు. ఈ సమయంలో ఇద్దరు బాలురు కొట్టిన దెబ్బలకు అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Also Read:మేనకోడలిపై ఏళ్లుగా ముగ్గురు మేనమామల అత్యాచారం, ఆమె చెల్లెలిని సైతం

వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు, తోటి అతిథులు రవిని ఉల్హాస్‌నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతనిని పరీక్షించిన వైద్యులు మరణించినట్లు ధ్రువీకరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మూడు గంటల్లోనే దొంబివ్లిలో నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై ధానే డీసీపీ (జోన్-4) ప్రమోద్ షెవాలే మాట్లాడుతూ.. చిన్న వివాదం కారణం హత్యకు దారి తీసిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.

Also Read:ఉన్నావ్ కేసు: జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు... కంటతడి పెట్టిన సెంగార్

స్కూలును మధ్యలోనే మానేసిన వీరిద్దరి వయసు 17 సంవత్సరాలేనని... నిందితుల్లో ఒకరిపై గతంలోనే క్రిమినల్ కేసులు నమోదవ్వగా.. ఇటీవల బాల నేరస్థుల కోర్టు అతనిని విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. వయసును నిర్ధారించిన తర్వాత నిందితులు ఇద్దరిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.