హర్యానాలో దారుణం జరిగింది. తండ్రి తర్వాత తండ్రిలా ఆలనా పాలనా చూసుకోవాల్సిన మేనమామలు మేనకోడలి జీవితాన్ని నాశనం చేశారు. తన మేనమామలు ఏళ్ల తరబడి అత్యాచారం చేశారంటూ ఓ బాలిక హిస్సార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆ రాష్ట్రంలో కలకలం రేపింది.

తాను మైనర్‌గా ఉన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల ఆమోదంతోనే మేనమమాలు ఏళ్ల తరబడి అఘాయిత్యానికి పాల్పడ్డారని.. తనకు 18 ఏళ్ల వసు వచ్చాక 2017 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు.

తనకు పెళ్లి కావడంతో తన స్థానంలో తన చెల్లెలిపై మావయ్యలు అత్యాచారం చేస్తున్నారని.. కానీ తన సోదరి భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆమె వాపోయింది. ముందు తన మావయ్యలు తన తల్లీతో శారీరక సంబంధం పెట్టుకుని ఆ తర్వాత ఆమె ద్వారా తనను లొంగదీసుకున్నట్లు యువతి వెల్లడించింది.

దీనిపై తాను తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ వారు తిరిగి తననే కొట్టేవారని, తనకు వివాహం జరిగిన తర్వాత తన సోదరిని హోటల్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారాలకు పాల్పడేవారని తెలిపింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులతో పాటు ఏడుగురిపై ఐపీసీ సెక్షన్ 354, 376, 376(2), 323, 506, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కేసు దర్యాప్తు బాధ్యతను మహిళా పోలీసులకు అప్పగించారు ఉన్నతాధికారులు.