ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. బెట్టింగ్ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు అదుపులో తీసుకున్నారు.
ఐపీఎల్ టోర్నీ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతుండగా.. అదే సమయంలో బెట్టింగ్ రాయులు మాత్రం రెచ్చిపోతున్నారు. క్రికెట్ మీద అభిమానాన్ని లేదా ఈజీగా డబ్బులు పొందవచ్చనే ఆశ జూపి బెట్టింగ్ రాయులు మోసాలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. కదులుతున్న వాహనంలో మొబైల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న రాకెట్ గట్టురట్టు అయ్యింది. ఈ ఆపరేషన్ లో ఇద్దరు వ్యక్తులను కోల్‌కతా పోలీసులు శనివారం అరెస్టు చేశారు . అరెస్టయిన ఇద్దరు వ్యక్తులను సత్యేంద్ర యాదవ్ (29), సుమిత్ సింగ్ (33)గా గుర్తించారు. వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120B (నేరపూరిత కుట్ర), 420 (మోసం), పశ్చిమ బెంగాల్ గ్యాంబ్లింగ్ అండ్ ప్రైజ్ కాంపిటీషన్స్ యాక్ట్ 1957లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కోల్‌కతాలో కదులుతున్న వాహనంలో క్రికెట్ బ్యాటింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన కోల్‌కతా పోలీసుల బృందం అనుమానాస్పదంగా తిరుగుతున్న కారును గుర్తించారు. ఆ కారును అనుసరించి వాటర్‌లూ స్ట్రీట్ సమీపంలో పోలీసులు అడ్డగించారు. కారును శోధించగా పోలీసులకు మూడు మొబైల్ ఫోన్లు, ఇతర ప్రతాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బెట్టింగ్ కు ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు కొత్త ఎత్తుగడను అమలు చేశారనే చెప్పాలి.. ఓ చోట కూర్చొని చేసే సంప్రదాయ పద్ధతికి స్వస్తి చెప్పడమే. శనివారం జరిగిన భారత్-పాక్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ లో భారత్ 266 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా పాకిస్థాన్ బ్యాటింగ్ చేయలేకపోయింది. దీనితో.. రెండు జట్లకు పాయింట్లు పంచారు. 2023 ఆసియా కప్‌లో పాకిస్థాన్ మొదటి మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించడంతో పాకిస్తాన్ సూపర్ ఫోర్‌లోకి ప్రవేశించింది.
