ముంబైలో దారుణ ఘటన జరిగింది. పార్కింగ్ చేసి ఉన్న బస్సులో ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ ఆ యువతికి స్నేహితులే కావడం గమనార్హం.

మహారాష్ట్ర, నవీ ముంబైలోని ఖర్గార్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న బస్సులో 19యేళ్ల యువతిపై ఇద్దరు స్నేహితులు అత్యాచారం చేశారు. ఇద్దరు యువకుల్లో ఒకరు డ్రైవరుగా, మరొకరు పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. 

యువతికి బైక్ డ్రైవింగ్ నేర్పిస్తామని చెప్పి ఆమెను తీసుకువచ్చారు. వచ్చేప్పుడు డ్రైవర్ మద్యం కొన్నాడు. ఆ 19 ఏళ్ల మహిళను ఖార్జర్ లోని ఉత్కర్ష్ హాల్ సమీపంలో ఆపి ఉంచిన బస్సులోకి ఎక్కించారు. 

ఆ తరువాత ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితుడైన పిజ్జా డెలివరీ బాయ్ ను కూడా పిలిపించాడు. 

అక్కడికి చేరుకున్న పిజ్జా డెలివరీ బాయ్ కూడా యువతిపై అత్యాచారం చేశాడు. అత్యాచారం అనంతరం ఆమెను బస్సులోనే వదిలి పారిపోయారు. బాధిత మహిళ మరుసటి రోజు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక నిందితుడైన పిజ్జా డెలివరీ బాయ్ ను అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడైన డ్రైవరు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ముంబై పోలీసులు చెప్పారు.