శ్రీనగర్‌లో పోలీసులు కేవలం టెక్నాలజీ సహకారంతో ఇద్దరు ఉగ్రవాదులను కచ్చితత్వంతో కనిపెట్టగలిగారు. సీఆర్‌పీఎఫ్‌పై దాడి జరిగిన ఆరు రోజులు వారి ప్రతి కదలికను ట్రాక్ చేశారు. విజయంతంగా వారున్న చోటుకు వెళ్లి ఇద్దరినీ చాకచక్యంగా మట్టుబెట్టారు. 

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో ఉగ్ర బెడద ఎక్కవగా ఉంటున్నదని అందరికీ తెలిసిన విషయమే. పొరుగు దేశం నుంచి వచ్చి కశ్మీర్‌లో తలదాచుకునే వారు కొందరైతే.. వారి ప్రభావానికి గురై సాయుధులుగా మారుతున్నవారు స్థానిక యువకులు ఇంకొందరు. వీరిని గుర్తుపట్టడం పెద్ద సవాలే. అయితే, అనాదిగా బలగాలు అనుసరించే వ్యూహాల్లో కీలకంగా ఉండేది మానవ వనరులే. అంటే, పోలీసు బలగాలకు చెందిన కొందరు ఇన్ఫార్మర్ల నుంచి ఉగ్రవాద కదలికల సమాచారం తీసుకుంటుంటారు. ఈ సమాచారంతోనే ఉగ్రవాదులను పట్టుకోవడానికి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తుంటారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లతోనే ఉగ్రవాదులను పట్టుకుంటుంటారు. ఈ ఆపరేషన్‌లలోనే ఎదురు కాల్పులు జరుగుతుంటాయి. తాజాగా, శ్రీనగర్ పోలీసులు టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను కచ్చితత్వంతో ట్రాక్ చేసి మట్టుబెట్టారు.

ఏప్రిల్ 4వ తేదీన మౌసుమా ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో ఓ జవాన్ దుర్మరణం చెందాడు. మరో సీనియర్ అధికారి గాయపడ్డాడు. ఈ ఘటనను బలగాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఆ ఉగ్రవాదులను వేటాడే పని మొదలుపెట్టాయి. ఎలాంటి మానవ సహాయం లేకుండా పూర్తిగా టెక్నాలజీ ఆధారంగానే ఆ ఇద్దరు ఉగ్రవాదులను కచ్చితత్వంతోనే సీఆర్‌పీఎఫ్ బలగాలు ట్రాక్ చేసి ఆరు రోజుల్లో పట్టుకున్నాయి. వారిని మట్టుబెట్టాయి కూడా.

సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై దాడి జరిగిన చోట నుంచి అధికారులు టెక్నికల్ లీడ్స్ తీసుకున్నారు. టెక్నికల్ డీటెయిల్స్ జాగ్రత్తగా విశ్లేషించారు. కేవలం సైంటిఫిక్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విజయవంతంగా దర్యాప్తు చేసిన కేసు ఇది అని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎస్ఎస్‌పీ రాకేశ్ బల్వాల్ పేర్కొన్నారు. ఈ కేసులో పౌరుల నుంచి ఎలాంటి సమాచారం తీసుకోలేదని తెలిపారు. ఆరు రోజుల్లోనే ఆ ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించామని, ఇటీవలి కాలంలో పోలీసులు చేపట్టిన బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇది అని అన్నారు.

ఫోన్ రికార్డుల ఆధారంగా ఆ ఉగ్రవాదులను జల్లెడ పట్టారు అధికారులు. అప్పటి నుంచి వారి ప్రతి కదలికను జాగ్రత్తగా ట్రాక్ చేశారు. ఆ ఇద్దరిలో ఒక ఉగ్రవాదిని సులువుగా మట్టుబెట్టగలిగారు. కాగా, మరొకరు ఓ బిల్డింగ్‌లో దాక్కోవడంతో హతమార్చడం కష్టంగా మారింది. సుమారు రెండు గంటల తర్వాత రెండో ఉగ్రవాదిని కూడా అధికారులు మట్టుబెట్టారు.

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఆదివారం ఉద‌యం ఎన్‌కౌంటర్ జ‌రిగింది. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం అయ్యారు. అయితే ఇందులో మృతి చెందిన ఇద్దరు ఉగ్ర‌వాదులు ఇటీవ‌ల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సిబ్బందిపై ఇటీవల దాడికి పాల్ప‌డ్డ వారిలో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. 

చాలా ర‌ద్దీగా ఉండే శ్రీన‌గ‌ర్ ప్రాంతంలో నేటి ఉద‌యం ఈ కాల్పులు జ‌రిగాయి. ఇందులో మొద‌ట జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవ్వగా, రెండు గంటల తర్వాత జ‌రిగిన మ‌రో ఎన్ కౌంట‌ర్ లో ఇంకో ఉగ్ర‌వాది చ‌నిపోయారు. అయితే వీరి పూర్తి వివ‌రాలు ఇంకా పోలీసులు గుర్తించ‌లేక‌పోయారు. అయితే వారు పాకిస్తాన్‌కు చెందినవారని చెప్పారు.