విషాదం.. నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి.. మరొకరికి గాయాలు..
IED Blast in Chhattisgarh : నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు కార్మికులు మరణించిన ఘటన ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ పేలుడులో మరో కార్మికుడికి కూడా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఛత్తీస్ గఢ్ లో విషాదం చోటు చేసుకుంది. నక్సలైట్లు అమర్చిన ప్రెషర్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన నారాయణపూర్ జిల్లాలోని ఇనుప ఖనిజం గనిలో శుక్రవారం చోటు చేసుకుంది.
cricket world cup 2023 : వరల్డ్ కప్ ఫైనల్.. అలా చేసి ఉంటే భారత్ కచ్చితంగా గెలిచేది - మమతా బెనర్జీ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్ పూర్ కు 350 కిలోమీటర్ల దూరంలో చోటే డొంగార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమ్దాయ్ ఘాటీ ఇనుప ఖనిజం గని ఉంది. అందులో పని చేసేందుకు ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో ముగ్గురు కార్మికులు బయలుదేరారు. ఈ క్రమంలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ పేలుడు వల్ల ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.
ఖతార్ లో 8 మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష.. భారత్ అప్పీల్ ను స్వీకరించిన ఆ దేశ కోర్టు
మృతులను నారాయణపూర్ జిల్లాకు చెందిన రితేష్ గగ్డా (21), శ్రవణ్ గగ్డా (24)గా గుర్తించారు. గాయపడిన మరో కార్మికుడిని వెంటనే చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్ లో చేర్పించారు. అతడిని ఉమేష్ రాణాగా గుర్తించారు. భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Afghanistan embassy : భారత్ లో రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేసిన ఆఫ్ఘనిస్తాన్.. కారణమేంటంటే ?
కాగా.. ఆమ్డై ఘాటీలోని ఇనుప ఖనిజం గనిని జయస్వాల్ నేకో ఇండస్ట్రీస్ లిమిటెడ్ (జేఎన్ఐఎల్)కు ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టును నక్సలైట్లు చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే నక్సలైట్లు ఐఈడీ అమర్చారని, ఆ దారిలో ప్రయాణిస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది.