Asianet News TeluguAsianet News Telugu

మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే భయం.. బాంబు ఉందంటూ ఫేక్ మెసేజ్ పెట్టిన విద్యార్థి...ఎక్కడంటే..

మ్యాథ్స్ ఎగ్జామ్ మీదున్న భయం ఆ విద్యార్థులను దిద్దుకోలేని తప్పు చేయించింది. ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించడం కోసం తమ స్కూల్ కే బాంబు పెట్టామని ఫేక్ బెదిరింపుకు దిగారు. ఇది అమృత్ సర్ లో జరిగింది. 
two held for hoax bomb threat to Amritsar school
Author
First Published Sep 13, 2022, 12:13 PM IST

అమృత్‌సర్‌ : మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే అందరికీ భయంగానే ఉంటుంది. ఆల్ జీబ్రా గుండె గాబరా.. అని అందుకే అంటుండేవారు. అయితే ఇదే భయం ఆ విద్యార్థులను నేరస్తులుగా చేసింది. మ్యాథ్స్ ఎగ్జామ్ తప్పించుకునేందుకు ఆ విద్యార్థులు స్కూల్లో బాంబు ఉందని స్కూలు యాజమాన్యానికి తప్పుడు మెసేజ్ పెట్టాడో విద్యార్థి. అయితే, దీనిని చూసిన పాఠశాల యాజమాన్యం మాత్రం అది నిజమేనని కంగారు పడి... పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి దర్యాప్తు చేయగా.. ఆ మెసేజ్ ఫేక్ అయి తేలింది. ఈ ఫేక్ బెదిరింపులకు పాల్పడి, యాజమాన్యాన్ని తప్పుదారి పట్టించిన కేసులో ఇద్దరిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. 

వివరాల్లోకి వెడితే.. జంజాబ్ లోని అమృత్ సర్ లో ఈ ఘటన జరిగింది. ఫతేఘర్ చురియన్ రోడ్డులోని స్ప్రింగ్ డేల్ సీనియర్ స్కూల్‌కు బూటకపు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు దీనికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సెప్టెంబరు 14న పాఠశాలను పేల్చివేస్తామని వచ్చిన వాట్సాప్ బెదిరింపు స్క్రీన్‌షాట్‌లతో పాఠశాల యాజమాన్యం నగర పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

బాలుడిపై కుక్క దాడి.. కక్షకట్టిన రేంజ్ లో చేతులు, కాళ్లను కొరికేసి...వీడియో వైరల్...

దీనిమీద డీసీపీ ముఖ్‌విందర్ సింగ్ భుల్లర్ మాట్లాడుతూ, “విచారణలో, ఈ మెసేజ్ ను పంపించింది ఎవరో మేము కనిపెట్టాం. వారిద్దరూ ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు. నకిలీ టెర్రరిస్ట్ బెదిరింపులను వ్యాపింప చేయడం ద్వారా ఆ విద్యార్థులు పరీక్షలను రద్దు చేయాలన్నారు. దర్యాప్తు చేపట్టినప్పుడు ఈ మెసేజ్ లను విద్యార్థుల తండ్రుల మొబైల్ ఫోన్ల నుంచ పంపారని తెలిసింది. దీంతో దీనికోసం వాడిన సిమ్ కార్డులు ఉపయోగించిన ఇద్దరు విద్యార్థుల తండ్రులను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు.

మ్యాథ్స్ పరీక్ష రద్దు చేయించాలనే విద్యార్థి తన తండ్రి సెల్ ఫోన్ నుంచి బాంబు బెదిరింపు నాటకం ఆడారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అమృత్ సర్ నగరంలో వారం వ్యవధిలో ఇలాంటి సంఘటన జరగడం రెండోసారి. దీంతో అమృత్ సర్ నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. నగరంలోని ఒక ఉన్నత పాఠశాల సెప్టెంబర్ 7న బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై అర్థరాత్రి సోదాలు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios