కేరళలో వీధికుక్కలు చిన్నారుల మీద వరుసగా దాడులకు దిగుతున్నాయి. సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్న ఓ చిన్నారిని కుక్క విచక్షణారహితంగా కరిచేసింది. 

కేరళ : కేరళలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. పగ బట్టినట్టుగా చిన్నారుల మీదికి ఎగబడుతున్నాయి. కొందరు విద్యార్థులను వీధికుక్కలు తరిమిన ఘటన మరువకముందే అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తన మటుకు తాను ఆడుకుంటుండగా ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాలుడి పై కక్షగట్టిందా అన్న రేంజ్లో దాడిచేసి గాయపరిచింది. కాగా ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల ప్రకారం.. కోజికోడ్ జిల్లాలోని అరక్కినార్ లో సైకిల్ పై వస్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క ఆకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణ రహితంగా చేతులు, కాళ్లపై కొరికింది. బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఇంట్లోకి పారిపోయి కుక్క దాడి నుంచి తప్పించుకున్నాడు. కాగా బాలుడిపై కక్ష కట్టిన అన్న రేంజ్లో కుక్క దాడి చేసింది. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్ లో ఇదంతా రికార్డయింది. ఈ రికార్డ్ ద్వారానే ఈ వీడియో బయటకు వచ్చింది.

అలాగే కేరళలోని మరో ప్రాంతంలో సైతం కొందరు విద్యార్థులను వీధికుక్కలు తరిమిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఆ విద్యార్థులు ఇద్దరు వెంటనే పరుగెత్తుకుని వచ్చి ఓ ఇంట్లో గేటు వేసి దాడి నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజనులు స్పందిస్తూ కేరళను డాగ్స్ ఓన్ కంట్రీ అని కామెంట్ చేస్తున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…